
బార్ టెండర్లలో సిండికేటు
సాక్షి, పుట్టపర్తి నూతన మద్యం పాలసీ ద్వారా బార్లకు లైసెన్సులు ఇచ్చి.. మరింత ఆదాయం పెంచాలని భావించిన కూటమి సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. కూటమి పార్టీల నాయకులే సిండికేటుగా మారి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. బార్లకు ఇతరులను దరఖాస్తు చేయనీయకుండా అడ్డుకున్నారు.
జిల్లాలో మొత్తం 12 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఒక బార్‌ను కల్లుగీత కార్మికులకు కేటాయించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.5 లక్షలతో పాటు ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలుగా నిర్ణయించారు. దీంతో భారీగా దరఖాస్తులు అందుతాయని అందరూ భావించారు. అయితే కూటమి నేతలు దరఖాస్తు చేసేందుకు ఉత్సాహం చూపిన పలువురిని బెదిరించారు. దీంతో కూటమి నేతల కనుసన్నల్లోనే టెండర్లు నడిచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పక్కా ప్లాన్‌తో సిండికేటుగా మారిన కూటమి నేతలు పరిమితంగానే దరఖాస్తులు చేశారు. ఒక్కో బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు ఉంటేనే లాటరీ తీస్తామని నిబంధనలు విధించడంతో ఆరుబార్లకు నాలుగు చొప్పున మాత్రమే దరఖాస్తులు చేశారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారమే టెండర్లలో పాల్గొన్నట్లు స్పష్టం అవుతోంది. మిగతా ఐదుబార్లకు ఒక్కటంటే ఒక్క దరఖాస్తూ రాలేదు. దీంతో ఆ ఐదు బార్లకు లాటరీ వాయిదా వేశారు. ఇక కల్లుగీత కార్మికులకు రిజర్వు చేసిన బార్‌కు గరిష్టంగా 11 మంది పోటీ పడటం విశేషం.
మొత్తం 7 బార్లకు 35 మంది పోటీ పడగా.. లాటరీ విధానంలో ఎంపిక చేశారు. శనివారం ఉదయం పుట్టపర్తిలోని సాయి ఆరామం ఫంక్షన్ హాలులో కలెక్టర్ టీఎస్ చేతన్ లాటరీ ద్వారా బార్లు కేటాయించారు. సక్సెస్‌ఫుల్ అప్లికెంట్, ఆర్–1, ఆర్–2 చొప్పున ఒక్కో బార్‌కు ముగ్గురిని ఎంపిక చేశారు. మొదటి వారు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ సదరు వ్యక్తి ముందుకు రాకుంటే మరో వ్యక్తి.. ఆయన రాకుంటే ఇంకొకరు చొప్పున ముగ్గురిని ఎంపిక చేశారు.
● కల్లుగీత కార్మకులకు ఒక బార్ రిజర్వు చేయగా... హిందూపురంలో కేటాయించారు.
● ధర్మవరంలో మూడు బార్లకు గానూ.. కేవలం ఒకబార్‌కు మాత్రమే దరఖాస్తులు వేశారు. మిగతా రెండింటికి ఒక్క దరఖాస్తు అందలేదు.
● హిందూపురంలో మూడు బార్లకు గానూ రెండుబార్లకు దరఖాస్తులు అందాయి. మరో బార్‌కు ఎవరూ దరఖాస్తు చేయకుండా అడ్డుకున్నట్లు సమాచారం.
● కదిరిలో మూడు బార్లకు నోటిఫికేషన్ ఇవ్వగా.. రెండింటికి మాత్రమే దరఖాస్తులు అందాయి. మరో బార్‌కు దరఖాస్తు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
● పెనుకొండలో ఒక బార్‌కు నోటిఫికేషన్ ఇవ్వగా.. కేవలం నలుగురు మాత్రమే పోటీ పడ్డారు. ఎవరినీ దరఖాస్తు చేయనీయకుండా అడ్డుకున్నట్లు తెలిసింది.
● మడకశిరకు ఒక బార్ రాగా... కర్ణాటక వాళ్లతో కూటమి నేతలు సిండికేట్ అయినట్లు సమాచారం. దీంతో ఒకరు కూడా దరఖాస్తు చేసేందుకు ముందుకు రాలేదని తెలిసింది.
పక్కా ప్లాన్...
దరఖాస్తులు పరిమితం
నాలుగు దరఖాస్తులు వస్తేనే
లాటరీ తీస్తామనే నిబంధన
ఆరు బార్లకు నాలుగు చొప్పునే
దరఖాస్తులు అందిన వైనం
ఐదు బార్లకు ఒక్క దరఖాస్తు
కూడా రాక లాటరీ వాయిదా
పారదర్శకంగా బార్ల కేటాయింపు
పుట్టపర్తి టౌన్: జిల్లాలోని బార్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి పారదర్శంగా చేపట్టినట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక సాయిఆరామంలో జిల్లాలోని 6 బార్లకు ఓపెన్ లాటరీ తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... నిబంధనల మేరకు దరఖాస్తులు అందిన మొత్తం 7 బార్లకు (కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేసిన బార్‌తో కలిపి) 35 మంది పోటీ పడ్డారన్నారు. అందరి సమక్ష్యంలో లాటరీ తీసి బార్లు కేటాయించామన్నారు.
రీ నోటిఫికేషన్ ఇస్తాం
నిబంధనల మేరకు ఒక్కో బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలి. కానీ జిల్లాలో ఐదు బార్లకు నాలుగులోపే దరఖాస్తులు అందాయి. దీంతో ఆయా బార్లకు త్వరలోనే రీ–నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించాం. మిగిలిన వాటిని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన పారదర్శకంగా కేటాయించాం.
– గోవింనాయక్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, పుట్టపర్తి
ఐదు బార్లకు లాటరీ వాయిదా..
లాటరీ తీసిన కలెక్టర్..

బార్ టెండర్లలో సిండికేటు