
సీఆర్‌ఎంటీ సమస్యలు పరిష్కరించాలి
బత్తలపల్లి: సమగ్ర శిక్షలో పనిచేస్తున్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ (సీఆర్‌ఎంటీ)ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ నాయకులు రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో సీఆర్‌ఎంటీ యూనియన్ నాయకులు సోమవారం గుంటూరులో ఉన్న రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీనివాసరావును కలిసి వినతిపత్రాలు అందజేశారు. సీఆర్‌ఎంటీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సాయి, అశోక్, రమేష్, శివయ్య, హారన్‌బాషా, ఓబులేసు, నరసింహ, కృష్ణప్ప, మురళి, శివానంద తదితరులు పాల్గొన్నారు.