
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
పుట్టపర్తి అర్బన్: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పలుపురు ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్ల సాధనకు ‘ఫ్యాప్టో’ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో చైర్మన్ గజ్జల హరిప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కట్టుబడి గౌస్‌లాజం మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయకూడదన్నారు. పీ–4 కార్యక్రమంలో ఉపాధ్యాయులను బాధ్యులను చేయరాదన్నారు. ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేసే క్రమంలో ఇన్‌చార్జ్ ఇచ్చే సమయంలో జీఓ నంబర్ 73 ప్రకారం ఉమ్మడి సీనియార్టీని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అలాగే నూతనంగా ఉన్నతీకరించిన రీ అపోర్షన్ స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు మంజూరు కాలేదని, వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు 3 పెండింగ్ డీఏలను ప్రకటించాలని, డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారందరికీ పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయుల జీపీఎఫ్ సమస్యలను పరిష్కరించి కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలని, సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించి గ్రేడ్–2 పండిట్లు, పీఈటీలకు పదోన్నతలు ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఏడాది పాటు ఎదురు చూశామని, అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఆందోళనకు దిగామన్నారు. ఇప్పటికీ స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఏఓ వెంకటనారాయణకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రెటరీ చంద్ర, సుధాకర్, హరిప్రసాద్ రెడ్డి, కోచైర్మన్ శమీ ఉల్లా, రామకృష్ణ, సెక్రెటరీ జనరల్ వెంకటనాయుడు, కోశాధికారి భాస్కర్‌రెడ్డి, రామమోహన్, చంద్రశేఖర్ (ఎస్‌టీయూ), శ్రీనివాసులు, త్రిమూర్తి (ఏపీటీఎఫ్257), తాహిర్ వలి, లక్ష్మీనారాయణ(యూటీఎఫ్), సురేంద్ర, సుందర్‌రాజు (ఏపీటీఎఫ్1938), ఫిరోజ్ అహమ్మద్ (ఆర్‌యూటీఏ), రామాంజనేయులు యాదవ్, గోపాల్ (హెచ్‌ఎం అసోసియేషన్), మారుతీ ప్రసాద్(డీటీఎఫ్), సుధాకర్ (స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్), శివకుమార్, వెంకటేష్ (పీడీ అసోసియేషన్), రమణారెడ్డి (వైఎస్సార్ టీఏ), వెంకటనాయుడు, ఎర్రిస్వామి (ఏపీటీఏ) తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలి
ఫ్యాప్టో ఆధ్వర్యంలో
ఉపాధ్యాయుల నిరసన

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి