
సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఉండాలి
పుట్టపర్తి టౌన్: ప్రతి బ్యాంకులోనూ సెక్యూరిటీ సిబ్బందితో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ రత్న బ్యాంక్ అధికారులకు సూచించారు. శనివారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ బ్యాంకు శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు వివరిస్తూ తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..బ్యాంకులో ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు సంబంధిత పోలీస్టేషన్‌కు కాల్ వెళ్లేలా అలారం వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి బ్యాంకు పరిసరాల్లోనూ రాత్రి వేళ లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ఖాతాదారులు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే తక్షణ సాయం కోసం 1930 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. అత్యవసర ఫోన్ నంబర్లు, సైబర్ నేరాలపై ఫిర్యాదు నంబర్లు, హెల్ప్ లైన్ నంబర్లు స్పష్టంగా కనిపించే విధంగా బ్యాంక్‌లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీ విజయకుమార్, ఎల్‌డీఎం ఏవీ రమణ కుమార్, వివిధ బ్యాంక్‌ల మేనేజర్లు రమేష్, శశిధర్, ముఖర్జీ, సైబర్ క్రైం సీఐలు శ్రీనివాసులు, మోహర్ తదితరలు పాల్గొన్నారు.
బ్యాంక్
అధికారులకు తెలిపిన
ఎస్పీ రత్న