జైన్‌ గోల్డ్‌ వజ్రాభరణాల మేళా ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జైన్‌ గోల్డ్‌ వజ్రాభరణాల మేళా ప్రారంభం

Jul 1 2026 12:28 AM | Updated on Jul 1 2026 12:28 AM

నెల్లూరు(బృందావనం): నెల్లూరు ఆచారివీధి పాత జెడ్పీ ఆఫీస్‌ సెంటర్‌లో ఉన్న జైన్‌ గోల్డ్‌ షోరూంలో ‘జైన్‌ గోల్డ్‌ వజ్రాభరణాలు మేళా – 2026’ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మణిలాల్‌జైన్‌, నరేంద్రజైన్‌, శాశ్వత్‌జైన్‌ మాట్లాడారు. సుమారు 60 సంవత్సరాల నుంచి ఖాతాదారుల మన్ననలు పొందుతున్నట్లు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే ఆభరణాలతో మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ఇది ఈనెల 4వ తేదీ వరకు ఖాతాదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రముఖ డిజైనర్లతో, నేటి, రేపటి తరానికి నచ్చే ఆభరణాలు రూపొందించి ఖాతాదారుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. మొజాంబిక్‌ రూబీ డైమండ్‌ నెక్లెస్‌, పాన్మారకీస్‌ హారాలు, టెన్నిస్‌ బ్రాస్లెట్స్‌, ఎంగేజ్‌మెంట్‌ నుంచి కాక్టెయిల్‌ ఉంగరాలు వరకు, పాత రోజుల ఫ్యాషన్‌కు సంబంధించి అడిగా నెక్లెస్‌, పెండెంట్‌సెట్స్‌ ప్రదర్శన, అమ్మకానికి ఉంచామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement