కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్
వెంకటాచలం: అక్రమంగా కోళ్ల వ్యర్థాలను రవాణా చేస్తున్న వాహనాన్ని మత్స్యశాఖ అధికారులు ఆదివారం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న దోస్త్ వాహనాన్ని ఆపి పరిశీలించారు. అందులో కోళ్ల వ్యర్థాలు ఉండటంతో వెంటనే వాహనాన్ని పోలీసులకు అప్పగించారు. వీటిని రవాణా చేస్తున్న పేరం రాజు, హనుమంతురావులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బుచ్చిరెడ్డిపాళెం: అక్రమంగా కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న ఓ వాహనాన్ని ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని దామరమడుగు వద్ద చేపల చెరువులకు మేతగా వినియోగించేందుకు తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు స్థానికంగా ఉన్న చేపల చెరువుల్లో కొందరు యజమానులు కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతున్నారన్నారు. ఈ క్రమంలో దామరమడుగు సమీపంలో తనిఖీలు చేపట్టగా వ్యర్థాలను తీసుకెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు. ఈ మేరకు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


