అజాతశత్రువు గౌతమ్‌రెడ్డి
● వాడవాడలా ఘన నివాళి
● భారీ స్థాయిలో అన్నదానం
ఆత్మకూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అజాతశత్రువని, చిన్న వయస్సులోనే ఆయన మరణించడం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ బస్టాండ్ వద్ద మేకపాటి గౌతమ్‌రెడ్డి నాలుగో వర్ధంతిని పార్టీ శ్రేణులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్య, జెడ్పీటీసీ పెమ్మసాని ప్రసన్నలక్ష్మి మాట్లాడారు. ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి 130 ఎకరాల్లో ఎమ్మెస్సెమ్‌ఈ పార్కును ఏర్పాటు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. గౌతమ్‌రెడ్డి లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన ఆశయసాధన కోసం మేక పాటి విక్రమ్‌రెడ్డి నేతృత్వంలో సమష్టిగా కృషి చేద్దామ ని పిలుపునిచ్చారు. అనంతరం భారీ స్థాయిలో అన్నదానాన్ని నిర్వహించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిమి రమేష్‌రెడ్డి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు నందా ఓబులేసు, పంచాయతీ విభాగ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్‌రెడ్డి, మైనార్టీ నేత మీరామొహిద్దీన్, ఎంపీపీ పద్మజారెడ్డి, పర్వీన్, కల్పనారెడ్డి, వైస్ ఎంపీపీ ప్రమీల, మర్రిపాడు మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, గంగవరపు శ్రీనివాసులురెడ్డి, నోటి వినయ్‌కుమార్‌రెడ్డి, తోడేటి మణి, విష్ణు, రహీం, కలామ్, ప్రతాప్, బాలఅంకయ్య, ఆండ్రా సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


