ఖాళీగా ఉండకుండా బీరసాగు
గతంలో ఉపాధి హామీ ఎఫ్‌ఏగా పనిచేసేవాడ్ని. పనుల నుంచి అకారణంగా తొలగించారు. దీంతో వ్యవసాయం బాట పట్టి బీరను సాగు చేస్తున్నా. వెలికంటిపాళెం, వరదాపురం గ్రామాల్లో పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నా. జాగ్రత్తలు పాటిస్తే కూరగాయల సాగు లాభదాయంగా ఉంటుంది. ఎకరాల్లో సాగు చేస్తే ఆశించిన లాభాలొచ్చే అవకాశం తక్కువ. రెండు నుంచి మూడు ఎకరాల్లో సాగుతో కుటుంబం ఇబ్బంది లేకుండా జీవించొచ్చు.
– దయాకర్‌రెడ్డి, యువ రైతు, వెలికంటిపాళెం
●


