మార్కెట్లోకి మారుతి ఎస్‌యూవీ ఈ–విటారా
నెల్లూరు(టౌన్): నెల్లూరులోని భార్గవి నెక్సా మారుతి సుజుకి షోరూంలో శుక్రవారం మారుతి తొలి ఎస్‌యూవీ ఈ–విటారా కారును నగర ఏఎస్పీ దీక్ష చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. భార్గవి నెక్సా మేనేజింగ్ డైరెక్టర్ కొండా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కారు 49 కేడబ్ల్యూహెచ్, 61కే డబ్ల్యూహెచ్ కలిగిన రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుందన్నారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 543 కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు. బ్యాటరీతో కలిపి ప్రారంభ ధర రూ.15.66 లక్షలు ఉందన్నారు. బ్యాటరీ ప్యాక్‌పై 8 ఏళ్లు వారెంటీ లేదా 1.60 లక్షల కిలోమీటర్లు ఉందన్నారు. ప్రారంభంలో బుక్ చేసుకున్న వారికి ఉచిత హోమ్ చార్జర్, ఇన్‌స్టాలేషన్ చేయునున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొండా ఈశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


