ఏ వర్గానికీ న్యాయం జరగలేదు
కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రాష్ట్రంలోని ఏ వర్గానికి న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలోని పలు పథకాల పేర్లు మార్చి నిధుల్లో, లబ్ధిదారుల్లో కోత విధించారు. అయితే మేము అంతా చేశామని కూటమి నేతలు చెప్పుకొంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటైనా సామాజిక పింఛన్‌ను మంజూరు చేయలేదు. బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే సంక్షేమ పథకాలు లేనట్టేనని తెలుస్తోంది. ఏ పథకాన్ని పరిశీలించినా పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు జరగలేదు. ఈ విషయాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. – బి.మాలకొండారెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్, చేజర్ల
●
ఏ వర్గానికీ న్యాయం జరగలేదు


