రాష్ట్ర చరిత్రలో ఇది దారుణమైన బడ్జెట్
రాష్ట్ర చరిత్రలో ఇది దారుణమైన బడ్జెట్. రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం పబ్లిసిటీ, ఈవెంట్ మేనేజ్‌మెంట్‌కే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంటోంది. ఈ వివరాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రజలకు వెల్లడించాలి. ఏ ఒక్క రంగానికీ సరైన కేటాయింపుల్లేవు. రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రూ.6 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. పేదల ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. అన్నదాత సుఖీభవ, పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు సక్రమంగా అమలు కాలేదు. – షేక్ అలీ అహ్మద్, వైఎస్సార్‌సీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్
●


