ప్రతిసారి నిరాశే | - | Sakshi
Sakshi News home page

ప్రతిసారి నిరాశే

Feb 19 2026 9:29 AM | Updated on Feb 20 2026 6:47 AM

ప్రతిసారి నిరాశే

ప్రతిసారి నిరాశే

అన్ని వర్గాలను దగా చేశారు

చంద్రబాబు ప్రభుత్వం మూడు బడ్జెట్‌లు ప్రవేశ పెట్టినప్పటికీ ప్రతిసారి ప్రజలకు నిరాశే మిగులుతోంది. సూపర్‌సిక్స్‌లో భాగంగా ఇచ్చిన హామీల్లో మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. అలాగే డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ ఊసే లేదు. యువతకు నిరుద్యోగ భృతి అంటూ మభ్యపెట్టారు. పింఛన్ల కోసం 50 సంవత్సరాల వయస్సు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారు. కార్పొరేట్‌ సంస్థలపై ఉన్న శ్రద్ధ హామీలు నెరవేర్చడంలో లేదు. రాష్ట్రంలో మోసం తప్ప అభివృద్ధి కనిపించడం లేదు.

– కొడవలూరు భక్తవత్సలరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు

ఎన్నికల సమయంలో సూపర్‌సిక్స్‌ పేరుతో హామీలిచ్చి వాటికి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం దారుణం. చంద్రబాబు చేసిన మోసానికి ఇది మరో నిదర్శనం. కొత్త పింఛన్లు మంజూరు లేదు. ఆడబిడ్డ నిధికి పైసా కూడా విడుదల చేయకపోవడం దుర్మార్గం. విద్యారంగానికి తక్కువ మొత్తం కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా నిరుద్యోగ భృతిపై ఆ ఊసే లేదు. దీనిపై ప్రశ్నిస్తున్నా స్పందన లేదు. నిధులు కేటాయించి ప్రతి నిరుద్యోగికి డబ్బులు అందజేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో యువత గుణపాఠం చెబుతుంది.

– ఊటుకూరు నాగార్జున, 13వ డివిజన్‌ కార్పొరేటర్‌, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement