రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

Feb 18 2026 6:56 AM | Updated on Feb 18 2026 6:56 AM

రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): ‘రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. బెల్టు షాపులు అధికమయ్యాయి’ అని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమారి, మ స్తాన్‌బీ అన్నారు. నెల్లూరు బాలాజీ నగర్‌లో మంగళవారం ఐద్వా జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్‌సిక్స్‌ పథకాలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను సూపర్‌గా కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. మహిళలపై దాడులు, బాలికలపై లైంగికదాడులు, హత్యలు పెరిగాయన్నారు. ఈనెల 22వ తేదీన మండలాల్లో ఐద్వా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడుతామన్నారు. కార్యక్రమంలో పద్మ, సుబ్బమ్మ, ప్రమీల, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement