కొనసాగుతున్న ‘కరెంటోళ్ల జనబాట’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం నెల్లూరు టౌన్ డివిజన్ పరిధిలోని బీవీ నగర్ విద్యుత్ సెక్షన్ పడారుపల్లిలో పర్యటించి వినియోగదారుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వదులుగా ఉన్న లైన్లు, డ్యామేజైన స్తంభాలు, తక్కువ ఎత్కులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, కాలంచెల్లిన లైన్లపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని సత్వరమే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నెల్లూరు టౌన్ ఈఈ శ్రీధర్, డీఈఈ అశోక్, ఏఈ రామ్‌ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.


