నిందితులను కఠినంగా శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

నిందితులను కఠినంగా శిక్షించాలి

Feb 18 2026 6:55 AM | Updated on Feb 18 2026 6:55 AM

నిందితులను కఠినంగా శిక్షించాలి

నిందితులను కఠినంగా శిక్షించాలి

నెల్లూరు రూరల్‌: సత్యసాయి జిల్లాలోని హిందూపూర్‌ నియోజకవర్గంలో గల చిలమత్తూరు మండలానికి చెందిన టీడీపీ నేత నాగేంద్ర.. బాలికలను బంధించి, వారి నగ్న వీడియోలను రికార్డ్‌ చేసి బెదిరించిన ఉదంతం సోషల్‌ మీడియాలో వైరలవుతోందని, తక్షణమే కఠినంగా శిక్షించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కాకాణి పూజిత తన ఎక్స్‌ వేదికగా స్పందించారు. పోక్సో చట్టం, బీఎన్నెస్‌ సెక్షన్ల మేరకు కేసు నమోదు చేయకుండా వ్యవహరించడం తగదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరారు. చంద్రబాబు తన రాజకీయ సౌలభ్యాన్ని మానుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలపై దృష్టి సారించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement