‘తల్లికి వందనం’లోనూ మోసమే
రాష్ట్ర బడ్జెట్లో విద్యావ్యవస్థకు అరకొరగా నిధులిచ్చారు. అమ్మఒడి పేరిట గత ప్రభుత్వ హయాంలో నిధులను సక్రమంగా మంజూరు చేసేవారు. అయితే తల్లికి వందనం పేరిట ప్రస్తుత సర్కార్ మోసం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 87,41,885 మంది పిల్లలు చదువుతుంటే, వారికి ఏడాదికి రూ.15 వేల చొప్పున రూ.13.112 కోట్లను చెల్లించాల్సి ఉంది. అయితే గతేడాది 21 లక్షల మందిని తగ్గించి 66 లక్షల మందికే చెల్లించినట్లు చూపారు. అందులోనూ రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల చొప్పునే అందించారు. ఇవ్వాల్సిన మొత్తాన్ని తక్కువ చేసి చూపించేందుకు యత్నిస్తున్నారు.
– పర్వతాల లలితారెడ్డి, వైఎస్సార్సీపీ మహిళాధ్యక్షురాలు, చిల్లకూరు మండలం


