నర్సరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు | - | Sakshi
Sakshi News home page

నర్సరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

Feb 18 2026 6:55 AM | Updated on Feb 18 2026 6:55 AM

నర్సరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

నర్సరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని అనువైన ప్రాంతాల్లో ఉద్యాన నర్సరీలను ఐదేళ్ల లీజు ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో ఉద్యానాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడా రు. కలువాయి, సైదాపురం, దుత్తలూరులోని కోల్డ్‌ స్టోరేజీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఫాంపాండ్స్‌ను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉద్యానాధికారులు వినూత్నంగా ఆలోచించి మెరుగైన ఫలితాలను సాధించాలని కోరారు. మోడరన్‌ నర్సరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పా రు. జిల్లాలో అమలు చేస్తున్న పనుల పురోగతిపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఉద్యానాధికారి రమణారెడ్డి వివరించారు. డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement