నగర డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగర డీఎస్పీగా బాధ్యతలను దీక్ష శుక్రవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛాలను నగర ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కార్యాలయ సిబ్బంది అందజేసి శుభాకాంక్షలను తెలిపారు. ఎస్పీ అజితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఐపీఎస్, 2021 బ్యాచ్‌కు చెందిన ఈమె గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా విధులు నిర్వర్తిస్తూ, నెల్లూరు నగర డీఎస్పీగా నియమితులైన విషయం విదితమే.
ఉత్సాహంగా
ముగ్గుల పోటీలు
వింజమూరు(ఉదయగిరి): సంక్రాంతిని పురస్కరించుకొని మండలంలోని గోళ్లవారిపల్లిలో ముగ్గుల పోటీలను ఎమ్మెస్సార్ డెవలపర్స్ అధినేత మాధవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల్లో ఉత్సాహాన్ని నింపేందుకు గానూ పోటీలను నిర్వహించామని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. డాక్టర్ వెంకటేశ్వరరావు, పీటీ నాయుడు, చిన్నవెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
నగర డీఎస్పీ బాధ్యతల స్వీకరణ


