పితృస్మృతుల్లో తడిచిన నయనాలు
● కుటుంబ బంధాలను
గుర్తు చేసిన పెద్ద పండగ
నెల్లూరు (బృందావనం): సంక్రాంతి.. కేవలం పిండి వంటలు, పంటల పండగ మాత్రమే కాదు. అది తరతరాల బంధాలను గుర్తుచేసే పర్వదినం. గురువారం మకర సంక్రాంతి సందర్భంగా నగర వాసులు తమ పితృదేవతలను స్మరిస్తూ కుటుంబ సభ్యులంతా ఒక్కటై పూజలు నిర్వహించారు. పినాకినీ నది ఒడ్డున బోడిగాడి తోట (సమాధుల తోట)లో నిశ్శబ్దంగా నిలిచిన సమాధులు కుటుంబ సభ్యుల భావోద్వేగాలకు సాక్ష్యాలయ్యాయి. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరిస్తూ పితృదేవతల సమాధులను పూలతో అలంకరించారు. సమాధుల చెంత నిలిచిన ప్రతి కుటుంబంలో ఒకరు తండ్రిని గుర్తు చేసుకున్నారు. మరొకరు తల్లిని, మరికొందరు తాత ముత్తాతల చేతిపట్టుకు ని నడిచిన రోజుల్ని తలుచుకున్నారు. పెద్దలు చెప్పిన మాటలు, చూపిన బాట, జీవితానికి ఇచ్చిన దిశ.. ఇవన్నీ ఆ క్షణాల్లో మళ్లీ మనసుల్ని తాకాయి. తల్లిదండ్రులు పిల్లలకు తమ పెద్దల కథలు చెబుతూ ‘వీరే మన మూలాలు’ అంటూ పూర్వీకులను గుర్తు చేశారు. ఒక వైపు మధుర జ్ఞాపకాలతో చిరునవ్వులు, మరో వైపు వాటినే తలుచుకుని చెమ్మ గిల్లిన కన్నులు కనిపించాయి. ఆనంద భాష్పాలు, గత స్మృతులు కలిసిన ఆ క్షణాలు ప్రతి హృదయాన్ని తడి చేశాయి. పితృదేవతలకు ప్రీతికరమైన పిండి వంటలను సమర్పిస్తూ, మోకరిల్లి స్మరించుకున్నారు. తల్లిదండ్రులు, తాతముత్తాతల జ్ఞాపకాలను పిల్లలకు వివరించి, కుటుంబ బంధాల ప్రాధాన్యతను తెలియజేశారు. తమపై ఉన్న కుటుంబ బాధ్యతలను గుర్తు చేసుకుంటూ, పెద్దలు చూపిన బాటలోనే జీవించాలని సంకల్పించారు. సంప్రదాయాలు, కుటుంబ బంధాలను తెలియజేస్తూ మకర సంక్రాంతి పర్వదినం ఘనంగా జరుపుకున్నారు.
పితృస్మృతుల్లో తడిచిన నయనాలు
పితృస్మృతుల్లో తడిచిన నయనాలు
పితృస్మృతుల్లో తడిచిన నయనాలు
పితృస్మృతుల్లో తడిచిన నయనాలు
పితృస్మృతుల్లో తడిచిన నయనాలు
పితృస్మృతుల్లో తడిచిన నయనాలు


