
జగన్‌ను కలిసిన కాకాణి
నెల్లూరు (స్టోన్‌సౌస్‌పేట): మాజీమంత్రి, నెల్లూరు ఉమ్మడి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆయన కుమార్తె రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి తాడేపల్లిలో సోమవారం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తాడేపల్లిలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. జిల్లాలో రాజకీయ పరిస్థితులు, పార్టీని బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డికి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై వైఎస్ జగన్ కొన్ని సూచనలు చేశారు.
మూడు శాఖల
అధికారులకు మెమోలు
నెల్లూరు(అర్బన్): ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సకాలంలో పరిష్కరించకుండా ఎక్కువ పెండింగ్‌లో ఉంచారంటూ మూడు ప్రభుత్వ శాఖల అధికారులకు మెమోలు జారీ చేయాలని కలెక్టరేట్ అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీలపై శాఖల వారీగా కలెక్టర్ ఆనంద్ సమీక్షించారు. దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, విద్యాశాఖ, వక్ఫ్‌బోర్డు శాఖలు వారి పరిధిలోని అర్జీలను పరిష్కరించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వీరికి మెమోలు జారీ చేస్తున్నట్టు తెలిపారు. మిగతా శాఖల అధికారులు కూడా అర్జీల విషయంలో నిర్లక్ష్యం చేస్తే వారిపైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అదనపు విధులపై సచివాలయ
ఉద్యోగుల రివర్స్
వింజమూరు (ఉదయగిరి): ప్రభుత్వం నిర్దేశించిన ఉత్తర్వులకు విరుద్ధంగా తమను అదనపు విధులు నిర్వర్తించమంటే చేయబోమంటూ గ్రామ సచివాలయ ఉద్యోగులు ఎదురుతిరిగారు. వింజమూరు తహసీల్దార్ హమీద్‌తో వాగ్వాదానికి దిగారు. వింజమూరు మండలంలోని వివిధ సచివాలయాల్లో పనిచేస్తున్న సచివాలయ సిబ్బందికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ విధులు నిర్వహించాలంటూ తహసీల్దార్ ఆదేశాలిచ్చిన నేపథ్యంలో సోమవారం సచివాలయ సిబ్బంది తహసీల్దార్ హమీద్‌ను ప్రశ్నించారు. ప్రభుత్వ జీఓలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు, సచివాలయ సర్వేయర్లు మాత్రమే కార్డులు పంపిణీ చేయాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ సచివాలయ సిబ్బందికి ఈ విధులు కేటాయించడం ఏమిటని తహసీల్దార్‌ను నిలదీశారు. ఇప్పటికే అనేక సర్వేలతోపాటు విధుల భారాన్ని మోస్తున్నామని, వెంటనే ఈ విధుల నుంచి తమను తొలగించాలని కోరారు. దీనికి తహసీల్దార్ స్పంది స్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఉద్యోగి కేటాయించిన విధులు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో తహసీల్దార్, సిబ్బంది మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేస్తానని తహసీల్దార్ హెచ్చరించడంతో సచివాలయ సిబ్బంది వెనుదిరిగారు.

జగన్‌ను కలిసిన కాకాణి

జగన్‌ను కలిసిన కాకాణి