Yuzvendra Chahal: ఐపీఎల్‌ చరిత్రలో చహల్‌ అరుదైన ఫీట్‌

Yuzvendra Chahal Equals Imran Tahir Record Highest Wickets Spinner IPL - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు. ఇప్పటికే పర్పుల్‌ క్యాప్‌ రేసులో దూసుకుపోతున్న చహల్‌ ఒక సీజన్‌లో స్పిన్నర్‌గా అత్యధిక వికెట్ల తీసిన  జాబితాలో ఇమ్రాన్‌ తాహిర్‌ సరసన నిలిచాడు. ఇప్పటివరకు చహల్‌ 14 మ్యాచ్‌ల్లో 26 వికెట్లు పడగొట్టాడు. శుక్రవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ధోనిని ఔట్‌ చేయడం ద్వారా సీజన్‌లో 26వ వికెట్‌ను ఖతాలో వేసుకున్నాడు.

ఇంతకముందు 2019లో ఇమ్రాన్‌ తాహిర్‌ సీఎస్కే తరపున 26 వికెట్లు పడగొట్టాడు. తాజాగా చహల్‌ తాహిర్‌తో సమానంగా నిలిచినప్పటికి.. మరో రెండు మ్యాచ్‌లు ఉండడంతో తొలి స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సీజన్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లంక స్పిన్నర్‌ వనిందు హసరంగా 24 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా.. సునీల్‌ నరైన్‌ 2012లో కేకేఆర్‌ తరపున స్పిన్నర్‌గా 24 వికెట్లు పడగొట్టి నాలుగో స్థానంలో ఉండగా.. 2013లో ముంబై ఇండియన్స్‌ తరపున హర్భజన్‌ 24 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. 

ఇక చహల్‌ తన కెరీర్‌లోనే బెస్ట్‌ ఫామ్‌ కనబరుస్తు‍న్నాడు. ఒకే మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్ల ఫీట్‌ సాధించిన అరుదైన బౌలర్ల జాబితాలో చహల్‌ చోటు సంపాదించాడు. టి20 ప్రపంచకప్‌ 2022 టార్గెట్‌గా కసిగా ఆడతున్న చహల్‌ను రూ. 6.5 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. తన ధరకు న్యాయం చేస్తున్న చహల్‌ రాజస్తాన్‌ ప్లేఆఫ్స్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా 2008 తర్వాత సూపర్‌ఫామ్‌లో కనిపిస్తున్న రాజస్తాన్‌ రాయల్స్‌ ఎలాగైనా కప్‌ కొట్టాలనే దృడ సంకల్పంతో ఉంది. మే 24న గుజరాత్‌ టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో​ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్లనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది.

చదవండి: Ravi Shastri: 'అర్థం పర్థం లేని ట్వీట్స్‌.. మాకేదో తేడా కొడుతుంది'

Yashasvi Jaiswal: 'బట్లర్‌, శాంసన్‌ల కంటే బెటర్‌గా కనిపించాడు'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top