దుమ్మురేపిన జైస్వాల్.. తొలి మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీ! | Sakshi
Sakshi News home page

DuleepTrophy 2022: దుమ్మురేపిన జైస్వాల్.. తొలి మ్యాచ్‌లోనే డబుల్‌ సెంచరీ!

Published Sat, Sep 10 2022 12:26 PM

Yashasvi Jaiswal slams Double Century against North East Zone In DuleepTrophy - Sakshi

దులీప్‌ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లోనే ముంబై యువ ఆటగాడు, వెస్ట్ జోన్ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతోన్న తొలి క్వార్టర్‌ ఫైనల్లో యశస్వి జైస్వాల్ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 321 బంతులు ఎదర్కొన్న జైస్వాల్‌.. 18 ఫోర్లు, 6 సిక్సర్లతో 228 పరుగులు సాధించాడు. జైస్వాల్‌ను అభినందిస్తూ.. రాజస్తాన్‌ రాయల్స్‌ ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు జైస్వాల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో అతడితో పాటు టీమిండియా వెటరన్‌ ఆటగాడు, వెస్ట్ జోన్‌ కెప్టెన్‌ ఆజింక్యా రహానే కూడా ద్విశతకం సాధించాడు.

ఈ మ్యాచ్‌లో 207 పరుగులు చేసి రహానే ఆజేయంగా నిలిచాడు. మరో వైపు ఓపెనర్‌ పృథ్వీ షా(113) సెంచరీతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో వెస్ట్‌ జోన్‌ రెండు వికెట్లు కోల్పోయి 590 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.


చదవండి: Duleep Trophy 2022: డబుల్‌ సెంచరీతో చెలరేగిన అజింక్య రహానే...

Advertisement
 
Advertisement
 
Advertisement