WPL 2023: యూపీ వారియర్జ్‌కు సంకట స్థితి.. గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు

వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్, యూపీ వారియర్జ్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ బౌలింగ్ ఏంచుకుంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే యూపీ వారియర్జ్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. అయితే పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరం.
ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రన్‌రేట్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే మైనస్‌లో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఇప్పటికే వరుసగా ఐదు విజయాలతో ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. హర్మన్‌ప్రీత్ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా.. యూపీ వారియర్జ్ బ్యాటింగ్‌లో మాత్రం ఒకరిద్దరిపైనే ఆధారపడింది.
కెప్టెన్ అలిస్సా హేలీ మంచి ఇన్నింగ్స్‌తో మెరవాల్సిన సమయం ఆసన్నమైంది. దీప్తి శర్మ, దేవికా వైద్య, కిరణ్ నవగిరే, తాహిలా మెక్‌గ్రాత్‌లు రాణిస్తేనే యూపీ గెలవగలదు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
🚨 Toss Update 🚨@UPWarriorz win the toss and elect to bowl first against @mipaltan.
Follow the match ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/LqLaohQ7BX
— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు