‘న్యూజిలాండ్‌ను సాకుగా చూపడం లేదు’

World Cup Postponed Due To Lack Of Preparation Time, Event CEO - Sakshi

దుబాయ్‌: వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల క్రికెట్‌ వరల్డ్‌కప్‌ను 2022కు వాయిదా వేయడంపై సర్వత్రా విమర్శల వస్తున్న తరుణంలో ఈ మెగా ఈవెంట్‌ సీఈవో ఆండ్రియా నెల్సన్‌ స్పందించారు. మహిళల క్రికెట్‌పై చిన్నచూపు చూడటం కారణంగానే వాయిదా వేశారంటూ పలు దేశాల క్రీడాకారిణులు విమర్శలకు దిగడంపై ఆండ్రియా వివరణ ఇచ్చారు. ‘ మహిళల వరల్డ్‌కప్‌ వాయిదా వేయడానికి చిన్నచూపు కారణం కాదు. ప్రస్తుతం కోవిడ్‌-19 కారణంగా సన్నాహకానికి ఆటంకం ఏర్పడుతుంది. అదే సమయంలో ఇంకా క్వాలిఫయర్స్‌ రౌండ్‌ కూడా జరగలేదు. ఇది జూలైలో జరగాల్సిన ఉ‍న్నప్పటికీ కరోనా వైరస్‌ కారణంగావాయిదా వేయక తప్పలేదు. అటువంటి తరుణంలో వరల్డ్‌కప్‌ నిర్వహణ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించడం ఈజీ కాదు. దాంతోనే 2022 వాయిదా వేశాం.(2021 భారత్‌లో... 2022 ఆస్ట్రేలియాలో)

ఇలా వాయిదా వేయడానికి న్యూజిలాండ్‌లోని భద్రతాపరమైన అంశాలు ఎంతమాత్రం కారణం కాదు. న్యూజిలాండ్‌లో కోవిడ్‌ కంట్రోల్‌లోనే ఉంది. వరల్డ్‌లో అతి తక్కువ కేసులు నమోదైన దేశాలలో న్యూజిలాండ్‌ కూడా ఒకటి. దాంతో కరోనాతో న్యూజిలాండ్‌లో ఇ‍బ్బంది ఉండదు. ఇక్కడ న్యూజిలాండ్‌ను సాకుగా చూపడం లేదు. కానీ క్వాలిఫయర్స్‌ టోర్నీ ఇంకా జరగలేదు కాబట్టి, ఈ మెగా టోర్నీని వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వెస్టిండీస్‌ వంటి ఒక దేశాన్ని చూసుకోండి. వారు ఒక జట్టుగా కలిసి పనిచేయడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇష్టపడటం లేదు. అటువంటప్పుడు ఒక ఈవెంట్‌కు ప్రిపేర్‌ కావాలని ఎలా ఆదేశిస్తాం’ అని ఆండ్రియా తెలిపారు. మహిళల వరల్డ్‌కప్‌పై ఐసీసీకి పట్టుదలగా లేకపోవడం కారణంగానే ఇంగ్లండ్‌ క్రికెట్‌ సారథి హీథర్‌నైట్‌ వ్యాఖ్యానించారు. (పాపం మహిళలు...)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top