విజ్డెన్‌ అవార్డ్స్‌ 2026లో టీమిండియా ప్లేయర్ల హవా | Wisden awards 2026: Indians take seven of nine main prizes, including four of five Cricketers of the Year | Sakshi
Sakshi News home page

విజ్డెన్‌ అవార్డ్స్‌ 2026లో టీమిండియా ప్లేయర్ల హవా

Apr 15 2026 1:22 PM | Updated on Apr 15 2026 1:49 PM

Wisden awards 2026: Indians take seven of nine main prizes, including four of five Cricketers of the Year

క్రికెట్‌ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విజ్డెన్‌ అవార్డుల్లో టీమిండియా ప్లేయర్లు ఆధిపత్యం చాటారు. ఈ ఏడాది తొమ్మిది ప్రధాన అవార్డుల్లో ఏకంగా ఏడు అవార్డులు భారత ఆటగాళ్లకే దక్కాయి. ఐదు క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుల్లో నాలుగు టీమిండియా ప్లేయర్లే కైవసం చేసుకున్నారు.

క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 

  • శుభ్‌మన్‌ గిల్– గతేడాది ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో 754 పరుగులు, ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో 269 & 161

  •  రవీంద్ర జడేజా– గతేడాది ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో 86 సగటు 516 పరుగులు. మాంచెస్టర్‌లో మ్యాచ్‌ సేవ్‌ చేసిన శతకం.  

  • రిషభ్‌ పంత్– గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనలో హెడింగ్లే టెస్ట్‌లో రెండు శతకాలు (134 & 118), మరో మ్యాచ్‌లో గాయంతోనూ హాఫ్‌ సెంచరీ.  

  • మొహమ్మద్‌ సిరాజ్– గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనలో 23 వికెట్లు, ఓవల్ టెస్ట్‌‌లో చివరి రోజు తొలి సెషన్‌లో 5 వికెట్లు.  

  • హసీబ్‌ హమీద్– ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌షైర్‌కు 15 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌షిప్‌. ఈ టోర్నీలో 66 సగటున 1258 పరుగులు.  

  • భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించిన దీప్తి శర్మకు లీడింగ్‌ వుమెన్స్‌ క్రికెటర్‌ ఇన్‌ ద వరల్డ్‌ అవార్డు లభించింది. 

  • టీమిండియా విధ్వంకర ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ లీడింగ్‌ టీ20 క్రికెటర్‌ ఇన్‌ ద వరల్డ్‌ అవార్డును ఎగరేసుకుపోయాడు. 

  • గతేడాది ఇంగ్లండ్‌ పర్యటనలో విశేషంగా రాణించిన భారత టెస్ట్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ విజ్డెన్‌ ట్రోఫీ (సింగిల్‌ టెస్ట్‌ ప్రదర్శనకు) గెలుచుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్‌ టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ, భారీ సెంచరీ సహా 430 పరుగులు చేసి భారత్‌ను గెలిపించినందుకు గానూ గిల్‌ను ఈ అవార్డు వరించింది. 

  • ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌కు లీడింగ్‌ మెన్స్‌ క్రికెటర్‌ ఇన్‌ ద వరల్డ్‌ అవార్డు లభించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement