Mithali Raj: మిథాలీ రాజ్‌ సంచలన నిర్ణయం.. ప్రపంచకప్‌ తర్వాత..!

When I retire after World Cup, squad will be far stronger says Mithali Raj - Sakshi

భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2022 తర్వాత రిటైర్మెంట్​​ ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే టీ20లకు మిథాలీ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ 4-1తేడాతో ఓటమి చవిచూసింది. అయితే అఖరి వన్డేలో గెలిచి భారత్‌ వైట్‌ వాష్‌ నుంచి తప్పించుకుంది.

ఈ మ్యాచ్‌లో మంధానతో పాటు మిథాలీ, హర్మాన్‌ ప్రీత్‌ కౌర్‌ అర్ధ సెంచరీలతో రాణించారు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన మిథాలీ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించింది. "ఈ టోర్నమెంట్ తర్వాత నేను రిటైర్మెంట్ ప్రకటిస్తాను.. నా రిటైర్మెంట్ తర్వాత  జట్టు యువ క్రికెటర్‌లతో మరింత బలంగా  మారుతుందని భావిస్తున్నాను" అని మిథాలీ పేర్కొంది. ఇప్పటి వరకు 222 వన్డేల్లో భారత తరుపున ఆడిన మిథాలీ రాజ్ 7,516 పరుగులు సాధించింది. తన కేరిర్‌లో  7 సెంచరీలు, 61 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

చదవండి: Rohit Sharma: కోహ్లి రికార్డుకే ఎస‌రు పెట్టిన హిట్‌మ్యాన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top