WFI: రెజ్లర్ల ఉద్యమం.. పర్యవేక్షక కమిటీలోకి బబితా

WFI Protest: Former Wrestler Babita Added Mary Kom 5 Members-Committee - Sakshi

మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంపై మేరీకోమ్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తమ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కమిటీ ఏర్పాటుకు ముందు తమను సంప్రదించలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

దీంతో తాజాగా  పర్యవేక్షణ కమిటీలో కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణ పతక విజేత, రెజ్లర్‌ బబిత ఫొగట్‌ను ఆరో సభ్యురాలిగా చేర్చినట్టు కేంద్ర క్రీడాశాఖ మంగళవారం ప్రకటించింది.  కాగా కమిటీలో మేరీకోమ్‌తో పాటు మాజీ రెజ్లర్‌ యోగేశ్వర్‌ దత్‌, మాజీ షట్లర్‌ తృప్తి ముర్గుండె, రాధిక శ్రీరామ్‌, రాజేశ్‌ రాజగోపాలన్‌లు ఉన్నారు. తాజాగా బబితా ఈ కమిటీలో ఆరో సభ్యురాలిగా చేరింది. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్‌ నియంతృత్వ ధోరణిని రెజ్లర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం డబ్ల్యూఎఫ్‌ఐ రోజువారి వ్యవహారాలను పర్యవేక్షక కమిటీనే చూస్తోంది.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top