ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. విండీస్‌ తుది జట్టు ప్రకటన | West Indies Have Named Unchanged Playing XI For Second Test Against England | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌.. విండీస్‌ తుది జట్టు ప్రకటన

Jul 17 2024 7:23 PM | Updated on Jul 17 2024 8:18 PM

West Indies Have Named Unchanged Playing XI For Second Test Against England

ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్‌ మ్యాచ్‌ కోసం వెస్టిండీస్‌ తుది జట్టును ఇవాళ (జులై 17) ప్రకటించారు. ఈ మ్యాచ్‌ కోసం విండీస్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించనుంది.

ఇంగ్లండ్‌ తమ తుది జట్టును నిన్ననే ప్రకటించింది. ఆండర్సన్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఇంగ్లండ్‌ ఆడబోయే తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఇది. మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 114 పరుగుల తేడాతో గెలుపొందింది.

లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ అన్ని విభాగాల్లో​ సత్తా చాటింది. అరంగేట్రం పేసర్‌ గస్‌ అట్కిన్సన్‌ ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో అదరగొట్టాడు. కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడిన ఆండర్సన్‌ పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకటి, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ తరఫున అరంగేట్రం చేసిన మరో ఆటగాడు జేమీ స్మిత్‌ బ్యాటింగ్‌, వికెట్‌కీపింగ్‌లో ఆకట్టుకున్నాడు. జేమీ డెబ్యూ ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేయడంతో పాటు మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. జేమీతో పాటు జాక్‌ క్రాలే, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌ హాఫ్‌ సెంచరీలు చేయడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌.. అట్కిన్సన్‌ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 136 పరుగులకు ఆలౌటైంది. రేపటి టెస్ట్‌ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్

వెస్టిండీస్‌ ప్లేయింగ్‌ XI: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్‌), మికిల్ లూయిస్, కిర్క్ మెకెంజీ, అలిక్ అథనాజ్, కవెమ్ హాడ్జ్, జాషువా డ సిల్వా (వికెట్‌కీపర్‌), జేసన్ హోల్డర్, గుడకేష్ మోటీ, అల్జరీ జోసెఫ్, షమర్ జోసెఫ్, జేడెన్ సీల్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement