మనం గెలవగలం.. మనం గెలుస్తాం: జడేజా

We Can, We Must And We Will Win, Jadeja - Sakshi

అబుదాబి:  వరుస ఓటములతో ఢీలాపడ్డ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఉత్సాహాన్ని తీసుకువచ్చే పనిలో పడ్డాడు ఆ జట్టు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. ఏడు మ్యాచ్‌ల్లో ఓడి కేవలం మూడింట మాత్రమే విజయాలు సాధించిన సీఎస్‌కేకు గెలిచే సత్తా ఉందంటూ ప్రేరణ తీసుకువచ్చే యత్నం చేస్తున్నాడు. సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో ఓటమి తర్వాత రవీంద్ర జడేజా.. ‘మనం గెలుస్తాం.. మనం గెలవగలం’ అంటూ స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. (ధోని.. మీరు అవకాశాలు ఇచ్చింది ఏది?)

సోమవారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఘోరంగా ఓడిపోయింది. సీఎస్‌కే నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్‌ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 28 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును జోస్‌ బట్లర్‌, స్టీవ్‌ స్మిత్‌లు ఆదుకున్నారు. ఈ జోడి మరొక వికెట్‌ పడకుండా జాగ్రత్త పడి జయకేతనం ఎగురవేసింది.  జోస్‌ బట్లర్‌(70 నాటౌట్‌; 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ‌), స్టీవ్‌ స్మిత్‌ (26నాటౌట్‌; 34 బంతుల్లో 2 ఫోర్లు)లు రాణించి జట్టును విజయపథంలో నడిపించారు. ఇది రాజస్తాన్‌కు నాల్గో విజయం కాగా, సీఎస్‌కేకు ఏడో ఓటమి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top