ఈ స్థాయిలో ఉన్నామంటే వారే కార‌ణం

Virat Kohli Leads Teachers Day Wishes Through Twitter - Sakshi

దుబాయ్ : ప్ర‌పంచంలో ప్ర‌తి మనిషికి త‌న‌ను గైడ్ చేసే గురువు ఏదో ఒక సంద‌ర్భంలో త‌గ‌ల‌డం స‌హ‌జ‌మే. ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో త‌ల్లిదండ్రుల త‌ర్వాత గురువుకు కూడా ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది.  అది సినిమా, క్రీడా ఇలా ఏ రంగ‌మైనా కావొచ్చు.. ఒక న‌టుడు గాని.. క్రీడాకారుడు కానీ జీవితంలో ఎదుగుతున్నారంటే వారి వెనుక గురువులు కీల‌క పాత్ర పోషిస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు స‌చిన్ టెండూల్క‌ర్ చిన్న‌నాటి కోచ్ ర‌మాకాంత్ అచ్రేక‌ర్.. స‌చిన్‌ను ప్రోత్స‌హించక‌పోయుంటే.. ఈరోజు మనం ఒక లెజెండ‌రీ క్రికెట‌ర్‌ను చూసేవాళ్లం కాదేమో.. అలాగే కోహ్లి, ధోని లాంటి ఆణిముత్యాలు భార‌త క్రీడావ‌నికి ప‌రిచ‌యం కాక‌పోయుండేవారేమో. సెప్టెంబ‌ర్ 5న భార‌త మాజీ రాష్ట్ర‌ప‌తి సర్వపల్లి రాధాకృష్ణన్ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఉపాధ్యాయుల దినోత్స‌వం ఆన‌వాయితీగా జ‌రుపుకుంటున్నాం. (చ‌ద‌వండి : కేఎల్‌ రాహుల్ కెప్టెన్సీపై న‌మ్మ‌కం ఉంది)

స‌ర్వేప‌ల్లి జ‌యంతిని పుర‌స్క‌రించుకొని భార‌త క్రికెట‌ర్లు విరాట్ కోహ్లి, శిఖ‌ర్ ధ‌వ‌న్‌, అజింక్యా ర‌హానేలు త‌మ జీవితంలో గురువులు ఎంత ప్రాముఖ్య‌త వ‌హించారనేది ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నారు. 'మీకంద‌రికి ఉపాధ్యాయ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు. మేము ఈరోజు ఈ స్థానంలో దృడంగా నిల‌బడ్డామంటే దానికి కార‌ణం ఉపాధ్యాయులు, క్రికెట్ కోచ్‌లు. న‌న్ను ఒక ఆట‌గాడిగా ప్రోత్స‌హించిన కోచ్‌ల‌కు,  చిన్న‌నాటి గురువుల‌కు నా వంద‌నాలు. వీరంతా నా జీవితంలో ఒక స్థంభాల్లా నిల‌బ‌డి నాకు మార్గనిర్దేశ‌నం చేశారు.' అంటూ  టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి ఉద్వేగంతో పేర్కొన్నాడు.

టీమిండియా టెస్టు జ‌ట్టు ఆట‌గాడు అజింక్యా ర‌హానే స్పందిస్తూ.. ' నా జీవితంలో ఇప్ప‌టికి నా గురువులు, కోచ్‌లు, టీమ్‌మేట్స్‌, మెంటార్స్, కుటుంబ‌స‌భ్యులు ఇచ్చే సూచ‌న‌లు పాటిస్తుంటా. ఇక మీద‌ట కూడా అలాగే కొన‌సాగుతా.. మీకంద‌రికి ఉపాధ్యాయ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు... న‌న్ను ప్రోత్స‌హించిన నా గురువుల‌కు, కోచ్‌ల‌కు ధ‌న్య‌వాదాలు.. మ‌నం నేర్చుకుంటాం అన్నంత వ‌ర‌కు గురువులు మ‌న‌తోనే ఉంటారు. ' అంటూ తెలిపాడు.

మ‌రో టీమిండియా క్రికెట‌ర్ శిఖ‌ర్ ధ‌వన్ త‌న చిన్న‌నాటి కోచ్ మ‌ద‌న్ శ‌ర్మ జీతో ఇటీవ‌లే దిగిన ఫోటో ఒక‌టి షేర్ చేశాడు. 'ఉపాధ్యాయ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని నా చిన్న‌నాటి కోచ్ మ‌ధ‌న్ శర్మ జీకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే అదంతా ఆయ‌న చ‌ల‌వే. థ్యాంక్యూ.. మ‌ధ‌న్ శ‌ర్మ జీ.. ' అంటూ రాసుకొచ్చాడు. సెప్టెంబ‌ర్ 19 నుంచి ఐపీఎల్ 13వ సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే వీరంతా దుబాయ్‌లో త‌మ జ‌ట్టు త‌ర‌పున ప్రాక్టీస్ ప్రారంభించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top