టాప్‌లో కోహ్లి.. రెండుకే పరిమితమైన రోహిత్‌

Virat Kohli And Rohit Sharma Maintain Top 2 Position In ICC ODI Rankings - Sakshi

దుబాయ్‌: ఐపీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌ విభాగంలో భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దుమ్మురేపాడు. 870 పాయింట్లతో కోహ్లి అగ్రస్థానంలో నిలవగా.. హిట్‌మాన్‌ రోహిత్‌ మాత్రం 842 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక మూడో స్థానంలో పాక్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌(837 పాయింట్లు) కొనసాగుతున్నాడు. కాగా అజమ్‌కు.. రోహిత్‌కు కేవలం 5 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.

కివీస్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ 818 పాయింట్లతో నాలుగు, ఆసీస్‌ ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ 791 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. గతేడాది డిసెంబర్‌లో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు అర్థసెంచరీలతో మెరిసిన కోహ్లి 870 పాయింట్లతో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. టాప్‌లో ఉన్న కోహ్లికి, రెండులో ఉన్న రోహిత్‌కు 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. మరోవైపు ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్‌ శర్మ మాత్రం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: 'ఇలాగే ఆడితే రికార్డులు బ్రేక్‌ అవడం ఖాయం'

ఇక బౌలింగ్‌ విషయానికి వస్తే.. కివీస్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ 722 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆప్ఘన్‌ క్రికెటర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌ రెండో స్థానంలో ఉండగా.. టీమిండియా బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మూడో స్థానంలో నిలిచాడు. బంగ్లా బౌలర్‌ మెహదీ హసన్‌, ఇంగ్లండ్‌ ఆటగాడు క్రిస్‌ వోక్స్‌ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండ్‌ విభాగంలో బంగ్లా స్టార్‌ ఆటగాడు షకీబ్‌ ఆల్‌ హసన్‌ టాప్‌ లేపగా.. మహ్మద్‌ నబీ, వోక్స్‌, స్టోక్స్‌, ఇమాద్‌ వసీమ్‌లు వరుసగా 2,3,4,5 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా నుంచి రవీంద్ర జడేజా(8వ స్థానం) మాత్రమే టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకున్నాడు.చదవండి: కోహ్లి కెప్టెన్‌... నేను వైస్‌ కెప్టెన్ అంతే‌! 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top