Srikar Bharat: 138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్స్‌లతో 156.. ప్చ్‌.. గెలిచినా నిరాశే!

Vijay Hazare Trophy: Srikar Bharat Scored 156 Runs But Andhra Out Of Tourney - Sakshi

భరత్‌ వీర విహారం

138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్స్‌లతో 156

చివరి మ్యాచ్‌లో గుజరాత్‌పై నెగ్గినా నాకౌట్‌ చేరని ఆంధ్ర

Srikar Bharat Scored 156 Runs In 138 Balls: కెప్టెన్‌ కోన శ్రీకర్‌ భరత్‌ మరో అద్భుత సెంచరీతో జట్టుకు విజయం అందించినా... రన్‌రేట్‌లో వెనుకబడటంతో విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీలో ఆంధ్ర జట్టు పోరాటం ముగిసింది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా గుజరాత్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 81 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 253 పరుగులు చేసింది.

శ్రీకర్‌ భరత్‌ 138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్స్‌లతో 158 పరుగులు సాధించి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగాడు. గిరినాథ్‌ రెడ్డి (34; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి భరత్‌ ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. అనంతరం గుజరాత్‌ జట్టు 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆంధ్ర బౌలర్లలో జి.మనీశ్‌ నాలుగు, గిరినాథ్‌ రెడ్డి రెండు వికెట్లు తీశారు.

ఆరు జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యాక హిమాచల్‌ప్రదేశ్, విదర్భ, ఆంధ్ర, ఒడిశా జట్లు మూడు విజయాలతో 12 పాయింట్లతో సమంగా నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ ఆధా రంగా హిమాచల్‌ప్రదేశ్‌ (+0.551), విదర్భ (+0.210) నాకౌట్‌ దశకు అర్హత పొందాయి. ఆంధ్ర (+0.042) మూడో స్థానంలో, ఒడిశా (–0.200) నాలుగో స్థానంలో నిలిచాయి.

చదవండి: LPL 2021: 6 బంతుల్లో ఐదు సిక్సర్లు.. వీడియో వైరల్‌
Ruturaj Gaikwad: సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్‌.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top