Ruturaj Gaikwad: సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్‌.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన

Vijay Hazare Trophy: Ruturaj Gaikwad Smashes 4th Century Join Elite Club - Sakshi

Ruturaj Gaikwad Smashes 4th Century Vijay Hazare Trophy 2021.. సీఎస్‌కే స్టార్‌ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. దేశవాలీ టోర్నీ అయిన విజయ్‌ హజారే ట్రోఫీలో పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు. మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రుతురాజ్‌ సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు.  ఇప్పటికే మూడు సెంచరీలు బాదిన రుతురాజ్‌ తాజాగా చండీఘర్‌తో ముగిసిన లీగ్‌ మ్యాచ్‌లో మరో సెంచరీతో మెరిశాడు. 95 బంతుల్లో 100 పరుగులు చేసిన రుతురాజ్‌కు.. తాను ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం.

చదవండి: విజయ్‌ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం...

ఈ సెంచరీతో విజయ్‌ హజారే ట్రోఫీలో 500 పరుగులు పూర్తి చేసిన రుతురాజ్‌ ఒక రికార్డును అందుకున్నాడు. విజయ్‌ హజారే ట్రోఫీలో ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన వారిలో విరాట్‌ కోహ్లి, దేవదత్‌ పడిక్కల్‌, పృథ్వీ షాలు మాత్రమే ఉన్నారు. తాజాగా వీరి సరసన రుతురాజ్‌ గైక్వాడ్‌ చేరాడు. విజయ్‌ హజారే ట్రోఫీ ద్వారా తన పరుగుల దాహాన్ని తర్చుకుంటున్న రుతురాజ్‌ ప్రస్తుతం సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారాడు. రుతురాజ్‌ను వెంటనే టీమిండియాకు ఎంపిక చేయాలంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున్న కోరుతున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్‌ ముగిసేలోపు రుతురాజ్‌ పేరును టీమిండియాలో చూసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

చదవండి: Martin Coetzee: 21 బంతుల్లోనే సెంచరీ.. టీమిండియా బతికిపోయింది

మ్యాచ్‌ విషయానికి వస్తే.. లీగ్‌లో మహారాష్ట్ర మరో విజయాన్ని దక్కించుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చంఢీఘర్‌ నిర్ణతీ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. కెప్టెన్‌ మనన్‌ వోహ్రా (139 బంతుల్లో 141, 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత సెంచరీతో మెరవగా.. అర్‌స్లాన్‌ ఖాన్‌ 87, అంకిత్‌ కౌషిక్‌ 56 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన మహారాష్ట్ర 48.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌(132 బంతుల్లో 168 పరుగులు, 12 ఫోర్లు, 6 సిక్సర్లు) మరో అద్బుత ఇన్నింగ్స్‌ ఆడగా.. చివర్లో అజిమ్‌ కాజీ 73 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం రుతురాజ్‌ 5 మ్యాచ్‌ల్లో 603 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top