జ్యోతి సురేఖ పునరాగమనం | Vennam Jyothi Surekha reentry in Indian Team | Sakshi
Sakshi News home page

జ్యోతి సురేఖ పునరాగమనం

May 29 2022 5:15 AM | Updated on May 29 2022 5:15 AM

Vennam Jyothi Surekha reentry in Indian Team - Sakshi

తొలి రెండు ప్రపంచకప్‌ టోర్నీల్లో పాల్గొన్న భారత మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ జట్టులో చోటు సంపాదించలేకపోయిన ఆంధ్రప్రదేశ్‌ స్టార్‌ ప్లేయర్‌ వెన్నం జ్యోతి సురేఖ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో సత్తా చాటుకొని మళ్లీ భారత జట్టులోకి వచ్చింది. సోనెపట్‌లో  భారత ఆర్చరీ సంఘం నిర్వహించిన జ్యోతి సురేఖ రాణించి జూన్‌ 21 నుంచి 26 వరకు పారిస్‌లో జరిగే ప్రపంచకప్‌ స్టేజ్‌–3 టోర్నీకి, జూలై 7 నుంచి 17 వరకు అమెరికాలో జరిగే వరల్డ్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టులో స్థానం దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement