 
													
నేను ఆల్‌రౌండర్‌ను.. బ్యాటింగ్ ఆర్డర్ ఏదైనా పర్లేదు.. అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటాను!
Unclarity Over Hardik Pandya’s Future- Venkatesh Iyer Is Ready to Mould Himself in Indian Team Batting Order: ‘‘నేను ఆల్‌రౌండర్‌ను.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ రాణించాల్సి ఉంటుంది. నన్ను ఏ స్థానంలో ఆడించినా పర్లేదు. ఒకవేళ తుదిజట్టులో ఉన్నట్లయితే ఆల్‌రౌండర్‌గా నా బాధ్యతను నెరవేరుస్తా’’ అన్నాడు టీమిండియా యువ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌తో ఈ కేకేఆర్ ఓపెనింగ్ స్టార్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా మూడు టీ20 మ్యాచ్‌లలోనూ ఆడే అవకాశం దక్కించుకున్న వెంకటేశ్... బ్యాటర్(4,12 నాటౌట్, 20 రన్స్)గా అంతగా ఆకట్టుకోలేదు. బౌలర్‌గానూ తన మార్కు చూపలేకపోయాడు. ఆఖరి టీ20లో మాత్రం ఒక వికెట్ తీశాడు. అయితే, ఒత్తిడిని జయిస్తే అయ్యర్ అద్భుతాలు చేయగలడని విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బౌలర్‌గా విఫలమవుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో అయ్యర్ మంచి ఆప్షన్ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన వెంకటేశ్ అయ్యర్... ‘‘ఒక క్రికెటర్‌గా ఎలాంటి సవాళ్లకైనా నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాను.
మూడో స్థానం లేదంటే ఐదో స్థానం.. మిడిలార్డర్ లేదంటే లోయర్ ఆర్డర్.. ఎక్కడ బ్యాటింగ్‌కు పంపినా సరే... పరుగులు చేయగలను. బౌలర్‌గానూ నా వంతు పాత్ర పోషించగలను. దేశం కోసం ఆడుతున్నపుడు జట్టు ప్రయోజనాలకు అనుగుణంగా నన్ను నేను సంసిద్ధం చేసుకుంటాను’’ అంటూ జట్టులో తను ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చాడు.
చదవండి: Ind Vs NZ Test Series: మెనూ వివాదంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
Venkatesh Iyer: 'రోహిత్ భయ్యా.. ద్రవిడ్ సర్‌కు చాలా థ్యాంక్స్'

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
