
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన భారత అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీకి బీహార్ క్రికెట్ అసోయేషిన్ ప్రమోషన్ ఇచ్చింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌కు గాను బీహార్ టీమ్ వైస్ కెప్టెన్‌గా సూర్యవంశీ ఎంపికయ్యాడు. ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీకి బీసీఎ సెలక్టర్లు సోమవారం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించారు.
ఈ జట్టు కెప్టెన్‌గా సకిబుల్ గని ఎంపికగా.. అతడికి డిప్యూటీగా వైభవ్ వ్యవహరించనున్నాడు. బిహార్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో అక్టోబర్ 15న అరుణాచల్ ప్రదేశ్‌తో తలపడనుంది. పియూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు సింగ్ వంటి స్టార్ ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. రాబోయే దేశీయ సీజన్‌కు జట్టును ఎంపిక చేయడానికి రాష్ట్రంలో తగినంత మంది సెలెక్టర్లు లేరని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అందుకే జట్టు ప్రకటన ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్‌లో అదరగొట్టి..
వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల వయస్సులో భారత అండర్-19 జట్టు తరపున మెరుగైన ప్రదర్శన చేసి రాజస్తాన్ రాయల్స్ స్కౌట్స్ దృష్టిలో పడ్డాడు. దీంతో ఐపీఎల్-2025 వేలంలో వైభవ్‌ను రూ. 1.1 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. అయితే రాజస్తాన్ నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి తన పేరును ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు.
ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ రికార్డులకెక్కాడు. ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో దుమ్ములేపాడు. వైట్‌బాల్, రెడ్ బాల్ సిరీస్‌లు రెండింటిలోనూ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఇప్పుడు ఏకంగా రంజీ ట్రోఫీ వంటి టోర్నీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది.
బిహార్ జట్టు
పీయూష్ కుమార్ సింగ్, భాష్కర్ దూబే, సకీబుల్ గని (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అర్నవ్ కిషోర్, ఆయుష్ లోహరుక, బిపిన్ సౌరభ్, అమోద్ యాదవ్, నవాజ్ ఖాన్, సాకిబ్ హుస్సేన్, రాఘవేంద్ర ప్రతాప్ సింగ్, సచిన్ కుమార్ సింగ్, హిమాన్షు కుమార్, ఖలిద్.
చదవండి: జైస్వాల్ అంటే గిల్‌కి అసూయ!.. అందుకేనా?: మాజీ క్రికెటర్ ఫైర్