జైపూర్‌పై యు ముంబా గెలుపు  | U Mumba to Big win over Jaipur Pink Panthers | Sakshi
Sakshi News home page

Pro Kabaddi Legue: జైపూర్‌పై యు ముంబా గెలుపు 

Dec 31 2021 9:15 AM | Updated on Dec 31 2021 9:15 AM

U Mumba to Big win over Jaipur Pink Panthers - Sakshi

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 37–28తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై నెగ్గింది. యు ముంబా తరఫున అజిత్‌ కుమార్‌ 11 పాయింట్లు,  జైపూర్‌ తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 14 పాయింట్లు సాధించారు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌ 42–28తో హరియాణా స్టీలర్స్‌పై ఘనవిజయం సాధించింది. పవన్‌ కుమార్‌ 22 పాయింట్లతో మెరిశాడు. 

విజేతలు మాల్విక, మిథున్‌ 
సాక్షి, హైదరాబాద్‌: అనంత్‌ బజాజ్‌ స్మారక ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో మిథున్‌ మంజునాథ్, మాల్విక బన్సొద్‌ విజేతలుగా నిలిచారు. పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో గురువారం ముగిసిన టోర్నీలో రెండో సీడ్‌ మాల్విక మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను చేజిక్కించుకోగా, పురుషుల టైటిల్‌ను ఎనిమిదో సీడ్‌ మిథున్‌ దక్కించుకున్నాడు. ఫైనల్లో మాల్విక 21–15, 21–9తో టాప్‌ సీడ్‌ ఆకర్షి కశ్యప్‌కు షాకిచ్చింది. మిథున్‌ 21–15, 21–4తో ఆదిత్య జోషిపై గెలుపొందాడు.

మహిళల డబుల్స్‌ తుది పోరులో సిమ్రన్‌ సింగ్‌–ఖుషీ గుప్తా జోడీ 21–16, 21–13తో తెలంగాణకు చెందిన వెన్నెల–శ్రియాన్షి వాలిశెట్టి జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్‌ ఫైనల్లో రవికృష్ణ–శంకర్‌ ప్రసాద్‌ ద్వయం 21–9, 21–12తో కృష్ణ ప్రసాద్‌–విష్ణువర్ధన్‌ గౌడ్‌ జోడీపై విజయం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ కపూర్‌–సంజన సంతోష్‌ జోడి విజేతగా నిలిచింది. విజేతలకు టాప్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్, ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ బహుమతులు అందజేశారు.

చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ సంచలన నిర్ణయం!

Advertisement
 
Advertisement
Advertisement