మిర్పూర్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్లు అదరగొట్టారు. ముష్ఫికర్ రహీమ్(214 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 106), లిట్టన్ దాస్(192 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 128) సెంచరీలతో కదం తొక్కారు. ఫలితంగా బంగ్లా జట్టు తమ తమ తొలి ఇన్నింగ్స్‌లో 476 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.
రెండో రోజు ఆరంభంలో సెంచరీ చేసిన అనంతరం రహీమ్ పెవిలియన్‌కు చేరాడు. రహీమ్‌కు ఇది తన కెరీర్‌లో వందో టెస్టు కావడం విశేషం. వందో టెస్టులో సెంచరీ చేసిన 11వ ఆటగాడిగా రహీమ్ రికార్డులకెక్కాడు. ముష్ఫికర్ ఔటైన తర్వాత లిట్టన్ దాస్ దూకుడుగా ఆడి తన ఐదవ టెస్టు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
వీరిద్దరితో పాటు మోమినుల్ హక్ (128 బంతుల్లో 63; 1 ఫోర్), హసన్ జాయ్ (34), షాద్‌మన్ ఇస్లామ్ (35) ఫర్వాలేదనిపించారు. . కెప్టెన్ నజ్ముల్ హసన్ షంటో (8) విఫలమయ్యాడు. ఐర్లాండ్ బౌలర్లలో ఆండీ మెక్‌బ్రినె 6 వికెట్లు పడగొట్టగా.. మాథ్యూ హంఫ్రీస్, గావిన్ హోయ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి టెస్టులో ఐర్లాండ్‌ను ఇన్నింగ్స్ తేడాతో బంగ్లా చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: యువరాజ్ ఒంటరి పోరాటం.. భారత్‌ను చిత్తు చేసిన అఫ్గాన్


