Tokyo Olympics: ఆ కంటెంట్‌కి ఒలింపిక్‌ కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌

Tokyo Olympics IOC Loosened Social Media Rules For Athletes - Sakshi

టోక్యో: కరోనా కట్టడితో అథ్లెట్లకు ఊపిరి ఆడని పరిస్థితి. ఒలింపిక్స్‌ విలేజ్‌లో ఆహ్లాదంగా గడపలేని పరిస్థితులు, కఠిన నిబంధనలు, ఆల్కహాల్‌- సెక్స్‌కి దూరం కావడం వెరసి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లకు కొంతలో కొంత ఊరట ఇచ్చింది ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ కమిటీ. సోషల్‌ మీడియా కఠిన నిబంధనల్ని ఎత్తేయడంతో అథ్లెట్లంతా ఒక్కసారిగా రెచ్చిపోతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ కమిటీ సోషల్‌ మీడియా రూల్స్‌ను సవరించింది. దీంతో టిక్‌టాక్‌ లాంటి వీడియో జనరేట్‌  కంటెంట్‌ యాప్‌లలో రెచ్చిపోతున్నారు అథ్లెట్లు. ఖాళీ టైం దొరికితే చాలు.. వాళ్లరూమ్‌లలో షార్ట్‌ వీడియోలు తీసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరికి ఈ-పాపులారిటీ దక్కుతుండడం విశేషం. ఐరిష్‌ జిమ్నాస్ట్‌ రైస్‌ మెక్‌క్లెనాగన్‌ ‘యాంటీ-సెక్స్‌’ బెడ్‌ పుకార్లను బద్ధలు కొట్టిన వీడియోతో మొదలైన సందడిని వందల మంది అథ్లెట్లు కొనసాగిస్తూ వస్తున్నారు. అమెరికన్‌ రగ్బీ ప్లేయర్‌ ఇలోనా మహెర్‌ తన టీంతో కలిసి, వాలీబాల్‌ ప్లేయర్‌ ఎరిక్‌ షోజీ, ఐరిష్‌ ట్రాక్‌ స్టార్‌ లియోన్‌ రెయిడ్‌.. ఈ జాబితాలో ముందున్నారు. అథ్లెట్లకు కేటాయించిన రూమ్‌ల్లో వాళ్ల చేస్తున్న సందడి మామూలుగా ఉండడం లేదు.

టఫ్‌ ఐవోసీ రూల్స్‌
ఐవోసీలోని ఇంతకు ముందు రూల్స్‌ ప్రకారం.. అథ్లెట్లతో పాటు కోచ్‌లు, అధికారులు ఎవరైనా కూడా ఫొటోలు మాత్రమే పోస్ట్‌ చేయాలి. కాంపిటీషన్‌ వెన్యూ నుంచి కూడా పోస్టులు పెట్టొచ్చు. కానీ, ఆడియో-వీడియో కంటెంట్‌ మాత్రం పోస్ట్‌ చేయడానికి వీల్లేదు. అలాగే నాన్‌-ఒలిపింక్‌ స్పాన్సర్స్‌కు సంబంధించిన పోస్ట్‌లు కూడా చేయకూడదు. అలా చేస్తే ఫైన్‌తో పాటు బ్యాన్‌కు కూడా అవకాశం ఉందని హెచ్చరికలు ఉండేవి. అయితే 2018 వింటర్‌ ఒలింపిక్స్‌ టైంలో అథ్లెట్లు.. ఆడియెన్స్‌తో ఇంటెరాక్ట్‌ అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ తీసే అవకాశం కల్పించింది.

అంతేకాదు వ్లోగర్స్‌ వీడియోలు తీసుకోవచ్చని పేర్కొంది. అయితే అదే ఒలింపిక్స్‌లో ఐస్‌ డ్యాన్సింగ్‌ అక్కాచెల్లెలు మయియా-అలెక్స్‌ షిబుటానీ ఒలింపిక్స్‌ వ్లోగ్‌ కక్రియేట్‌ చేయగా.. గంటలో దానిని యూట్యూబ్‌ కాపీరైట్స్‌ పాలసీ ఉల్లంఘనల పేరిట తొలగించేసింది. అప్పటి నుంచి కొన్ని పరిమితులతో వీడియోలకు అవకాశం ఇచ్చింది. ఇక కరోనా టైంలో ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉండడంతో అథ్లెట్లు వాళ్ల అనుభవాల్ని సన్నిహితులతో పంచుకోవచ్చని పేర్కొంది. అది కూడా నాన్‌-కమర్షియల్‌ అయితేనే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top