Alexander Zverev: టెన్నిస్ స్టార్‌కు వింత అనుభవం.. ఆస్ట్రేలియా పిట్ట ఎంత పని చేసే

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా జర్మనీ టెన్నిస్ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు వింత అనుభవం ఎదురైంది. సీరియస్‌గా మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆకాశంలో ఒక పిట్ట.. పోతూ పోతూ అతని తలపై రెట్ట వేసింది. ఒక్కక్షణం ఆగిన జ్వెరెవ్ ఏంటా అని తల నిమురుకుంటే పిట్ట రెట్ట అతని చేతులకు అంటింది.
దీంతో ఇదేం కర్మరా బాబు అనుకుంటూ పక్కకు వెళ్లి తలను టవల్‌తో తుడుచుకొని మ్యాచ్‌ను కంటిన్యూ చేశాడు. ఇది చూసిన అభిమానులు గొల్లుమని నవ్వారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి సెట్‌లో 2-2 స్కోరు సమానంతో టైబ్రేక్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇక ప్రపంచ 13వ ర్యాంకర్ అయిన అలెగ్జాండర్ జ్వెరెవ్ రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ మైకెల్ మోహ్ చేతిలో జ్వెరెవ్ 6-7(1), 6-4, 6-3,6-2తో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో సొంతం చేసుకున్న జ్వెరెవ్ ఆ తర్వాత అదే ఆటతీరును కనబరచడంలో విఫలమయ్యాడు. వరుస సెట్లలో మోహ్ చేతిలో ఖంగుతిన్నాడు.
A perfect shot from the Australian Open bird 💩🤣
Alexander Zverev will be hoping he gets some good luck after that 🍀#AusOpen | @AlexZverev pic.twitter.com/Bi1TDcfz1q
— Eurosport (@eurosport) January 19, 2023
చదవండి: మ్యాచ్ పట్టించుకోకుండా పక్షులు, ఆకాశంకేసి చూస్తున్నారా!?
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు