Kho-Kho League: ఫైనల్లో తెలుగు యోధాస్

పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్‌లో తెలుగు యోధాస్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వాలిఫయర్–2లో తెలుగు యోధాస్ 67–44 తో గుజరాత్ జెయింట్స్ జట్టును ఓడించింది. అరుణ్ గున్కీ 16 పాయింట్లు, ప్రజ్వల్ 14 పాయింట్లు సాధించి తెలుగు యోధాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. నేడు జరిగే ఫైనల్లో ఒడిషా జగర్‌నాట్స్‌తో తెలుగు యోధాస్ తలపడుతుంది.