IND Tour Of NZ: సిక్స్‌ ప్యాక్‌ బాడీలతో టీమిండియా క్రికెటర్లు.. కివీస్‌తో తొలి టీ20కి ముందు..!

Team India Cricketers Flaunt Abs On Beach In Wellington Ahead Of 1st T20 Vs NZ - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో పరాభవం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన టీమిండియా, రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్‌ పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనున్న భారత్‌.. వరల్డ్‌కప్‌ తాలూకా చేదు అనుభవాలను అధిగమించి, కివీస్‌పై అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాలని ఉవ్విళ్ళూరుతోంది. ఈ క్రమంలో రేపు (నవంబర్‌ 18) జరుగబోయే తొలి టీ20కి వేదిక అయిన వెల్లింగ్టన్‌కు చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది.

ప్రాక్టీస్‌లో పాల్గొన్న యువ భారత ఆటగాళ్లు ఎంతో హుషారుగా, ఆత్మ విశ్వాసంతో కనిపించారు. మధ్యలో దొరికిన కొద్దిపాటి ఖాళీ సమయంలో బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తూ సేద తీరారు. హార్ధిక్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌, అర్షదీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లు సిక్స్‌ ప్యాక్‌ బాడీలతో బీచ్‌ నుంచి బయటికి వస్తున్న వీడియోను వాషింగ్టన్‌ సుం‍దర్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది.

అభిమానులు రకరకాలుగా రియాక్ట్‌ అవుతున్నారు. కొందరు పాజిటివ్‌గా స్పందిస్తుంటే, మరికొందరు నెగిటివ్‌ కామెంట్స్‌తో రాక్షసానందం పొందుతున్నారు. ఇంకొందరేమో.. ఫిట్‌నెస్‌ విషయంలో శ్రద్ధ తీసుకునే భారత క్రికెటర్లు.. న్యూజిలాండ్‌పై గెలిచేందుకు కూడా అంతే శ్రద్ధతో కృషి చేయాలని సూచిస్తున్నారు.

కాగా, రేపు జరుగబోయే తొలి టీ20 భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో టీ20 జట్టుకు హార్ధిక్‌ పాండ్యా.. వన్డే టీమ్‌కు శిఖర్‌ ధవన్‌ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు.

టీ20 సిరీస్‌కు భారత జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

వన్డే సిరీస్‌కు టీమిండియా..
శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌, వికెట్‌కీపర్‌), శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, అర్షదీప్‌ సింగ్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ సేన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.

న్యూజిలాండ్‌ జట్టు:  
కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే (వికెట్‌ కీపన్‌), లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ (వన్డే). టామ్ లాథమ్ (వన్డే), డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి (టీ20). టిమ్ సౌతీ, బ్లెయిర్ టిక్నర్ (టీ20) 

టీ20 సిరీస్‌ షెడ్యూల్‌..
►మొదటి టీ20: నవంబరు 18, శుక్రవారం- స్కే స్టేడియం, వెల్లింగ్‌టన్‌
►రెండో టీ20: నవంబరు 20, ఆదివారం- బే ఓవల్‌, మౌంట్‌ మాంగనీ
►మూడో టీ20: నవంబరు 22, మంగళవారం- మెక్‌లీన్‌ పార్క్‌, నేపియర్‌
►మ్యాచ్‌ల ఆరంభ సమయం: మధ్యాహ్నం 12 గంటలకు(భారత కాలమానం ప్రకారం)

వన్డే సిరీస్‌ షెడ్యూల్‌..
►మొదటి వన్డే: నవంబరు 25, శుక్రవారం- ఈడెన్‌ పార్క్‌, ఆక్లాండ్‌
►రెండో వన్డే: నవంబరు 27, ఆదివారం- సెడాన్‌ పార్క్‌, హామిల్టన్‌
►మూడో వన్డే: నవంబరు 30, బుధవారం- హాగ్లే ఓవల్‌, క్రైస్ట్‌చర్చ్‌​
►మ్యాచ్‌ల ఆరంభ సమయం: ఉదయం 7 గంటలకు(భారత కాలమానం ప్రకారం)
చదవండి: కెప్టెన్‌ మార్పు వద్దు.. ఇలా చేస్తే టీమిండియాకు తిరుగే ఉండదు..!

చదవండి: కివీస్‌తో తొలి టి20.. ప్రాక్టీస్‌లో మునిగిన టీమిండియా ఆటగాళ్లు (ఫొటోలు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top