BAN vs SA: చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి!

Taskin Ahmed’s five for takes centre stage as Bangladesh script history in South Africa - Sakshi

దక్షిణాఫ్రికా గడ్డపై బంగ్లాదేశ్‌ చరిత్ర సృష్టించింది. తొలి సారి దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. నిర్ణాయక మూడో వన్డేలో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో బంగ్లాదేశ్‌ సొంతం చేసుకుంది. ఇక  టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తస్కిన్‌ అహ్మద్‌ (5/35) దెబ్బకు  37 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది.

దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జన్నెమాన్ మలన్ 39 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక బంగ్లాదేశ్‌ బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ 5 వికెట్లు పడగొట్టగా, షకీబ్ అల్ హసన్ రెండు, మెహాది హాసన్‌,షారిఫుల్ ఇస్లాం చెరో వికెట్‌ సాధించారు. ఇక 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కేవలం ఒకే ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (87 నాటౌట్‌; 14 ఫోర్లు) మెరిశాడు. తస్కిన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్, సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

చదవండి: PAK vs AUS: 'నువ్వా- నేనా' అంటూ కత్తులు దూసుకున్న వార్నర్‌, అఫ్రిది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top