IND-W vs ENG-W: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. భారత క్రికెటర్ గదిలో చోరీ

ఇంగ్లండ్ మహిళలతో వన్డే సిరీస్‌లో భారత జట్టు సభ్యురాలిగా ఉన్న తానియా భాటియాకు అనూహ్య పరిణామం ఎదురైంది. లండన్‌లో ఆమె బస చేసిన మారియట్ హోటల్‌లోని తన గదిలో దొంగతనం జరిగినట్లు ఆమె వెల్లడించింది. ‘నన్ను చాలా నిరాశకు గురి చేసిన, నిర్ఘాంతపోయే ఘటన ఇది. ఎవరో అపరిచితులు నా గదిలోకి వచ్చి బ్యాగ్ చోరీ చేశారు. ఇందులో నగదు, కార్డులు, గడియారాలతో పాటు నగలు కూడా ఉన్నాయి.
ఇంగ్లండ్ బోర్డుతో భాగస్వామ్యం ఉన్న హోటల్‌లోనే ఇలా జరిగింది. భద్రతా ఏర్పాట్ల వైఫల్యం ఇది. వీలైనంత తొందరగా విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నా’ అని తానియా ట్వీట్ చేసింది. కాగా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
చదవండి: Runout controversy: ‘అప్పటికే పలుమార్లు హెచ్చరించాం’