T20 WC 2022: 73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం

T20 World Cup 2022: SL vs UAE Match Higligths and Updates - Sakshi

ICC Mens T20 World Cup 2022- Sri Lanka vs United Arab Emirates, 6th Match, Group A: శ్రీలంక వర్సెస్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ 

73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ..  శ్రీలంక ఘన విజయం
టీ20 ప్రపంచకప్‌-2022లో శ్రీలంక తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌ ‘ఎ’(క్వాలిఫియర్స్‌) తొలి రౌండ్‌లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో శ్రీలంక విజయ భేరి మోగించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 17.1 ఓవర్లలోనే కేవలం 73 పరుగులకే కుప్పకూలింది.

శ్రీలంక బౌలర్లలో చమీరా, హాసరంగా చెరో మూడు వికెట్లతో యూఏఈను దెబ్బ తీయగా.. తీక్షణ రెండు, షనక, మధుషాన్‌ తలా వికెట్‌ సాధించారు. ఇక యూఏఈ బ్యాటర్లలో ఆఫ్జల్‌ ఖాన్‌(19) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన  శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.

ఓపెనర్‌ పాథుమ్‌ నిసాంక 60 బంతుల్లో 74 పరుగులతో లంక ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈ బౌలర్లలో కార్తిక్‌ మెయప్పన్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జహూర్‌ ఖాన్‌ రెండు, అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ ఒకటి, ఆర్యన్‌ లక్రా ఒక వికెట్‌ తీశారు.

36 పరుగులకే 6 వికెట్లు.. ఓటమి దిశగా యూఏఈ
36 పరుగులకే యూఏఈ 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  9 పరుగులు చేసిన ఆరవింద్‌.. హాసరంగా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. యూఏఈ విజయానికి 54 బంతుల్లో 114 పరుగులు కావాలి.

నాలుగో వికెట్‌ కోల్పోయిన యూఏఈ
21 పరుగుల వద్ద యూఏఈ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూరి.. మధుషాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

19 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో యూఏఈ
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంక పేసర్‌ చమీరా మూడు వికెట్లు పడగొట్టి యూఏఈను ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన యూఏఈ
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ తొలి వికెట్‌ కోల్పోయింది. 2 పరుగులు చేసిన వసీం.. చమీరా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

యూఏఈతో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్‌ పాథుమ్‌ నిసాంక 60 బంతుల్లో 74 పరుగులతో లంక ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కుశాల్‌ మెండిస్‌(18), ధనుజంయ డి సిల్వా(33) తప్ప మిగతా వాళ్లంత సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. 

యూఏఈ బౌలర్లలో కార్తిక్‌ మెయప్పన్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జహూర్‌ ఖాన్‌ రెండు, అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ ఒకటి, ఆర్యన్‌ లక్రా ఒక వికెట్‌ తీశారు.
 

మరో వికెట్‌ కోల్పోయిన లంక
లంకకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 15వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన దసున్‌ షనక బృందం.. ఆ మరుసటి ఓవర్లో మరో వికెట్‌ నష్టపోయింది. 16వ ఓవర్‌లో అఫ్ఝల్‌ ఖాన్‌ బౌలింగ్‌లో నాలుగో బంతికి హసరంగ.. బాసిల్‌ హమీద్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. స్కోరు: 121-6. చమిక కరుణరత్నె, పాథుమ్‌ నిసాంక క్రీజులో ఉన్నారు.

ఒకే ఓవర్లో మూడు వికెట్లు
యూఏఈ బౌలర్‌ మెయప్పన్‌ శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 15వ ఓవర్‌ నాలుగో బంతికి రాజపక్సను పెవిలియన్‌కు పంపిన అతడు.. ఆ మరుసటి రెండు బంతుల్లో అసలంక, దసున్‌ షనకలను బౌల్డ్‌ చేశాడు.

దీంతో ఒకే ఓవర్లో శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మెయప్పన్‌ హ్యాట్రిక్‌ తీసిన సంతోషంలో సంబరాలు చేసుకున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరు: 117-5

14 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరెంతంటే
యూఏఈ జరుగుతున్న క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో శ్రీలంక 14 ఓవర్లు ముగిసే సరికి 114/2 రెండు వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. పాథుమ్‌ నిసాంక, భనుక రాజపక్స క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
12వ ఓవర్‌ మొదటి బంతికే శ్రీలంక రెండో వికెట్‌ కోల్పోయింది. అఫ్జల్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ధనుంజయ (33పరుగులు)  రనౌట్‌గా వెనుదిరిగాడు.

10 ఓవర్లకు శ్రీలంక స్కోర్‌: 84/1
10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్‌ కోల్పోయి 84 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(38), ధనుంజయ డి సిల్వా(27) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
42 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్‌ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కుశాల్‌ మెండిస్‌.. లక్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 5 ఓవర్లకు శ్రీలంక స్కోర్‌: 57/1

2 ఓవర్లకు శ్రీలంక స్కోర్‌: 19/0
2 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్‌ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్‌ మెండిస్‌(13), నిస్సాంక(5) పరుగులతో ఉన్నారు.

టీ20 ప్రపంచకప్‌-2022 క్వాలిఫియర్స్‌(గ్రూప్‌-ఎ)లో యూఏఈ, శ్రీలంక జట్లు చావోరేవో తేల్చుకోవడానికి  శ్రీలంక సిద్దమయ్యాయి. గీలాంగ్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన యూఏఈ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

కాగా ఈ మ్యాచ్‌కు శ్రీలంక ఆటగాడు గుణతిలక గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో అసలంక తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఇరు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చెందాయి. ఈ క్రమంలో సూపర్‌-12 అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకం.

తుది జట్లు: 
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్‌ కీపర్‌), ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ

యూఏఈ: చిరాగ్ సూరి, ముహమ్మద్ వసీం, కాషిఫ్ దౌద్, వృత్త్యా అరవింద్(వికెట్‌ కీపర్‌), ఆర్యన్ లక్రా, బాసిల్ హమీద్, చుండంగపోయిల్ రిజ్వాన్(కెప్టెన్‌), అయాన్ అఫ్జల్ ఖాన్, కార్తీక్ మెయ్యప్పన్, జునైద్ సిద్దిక్, జహూర్ ఖాన్
చదవండి: T20 WC NED Vs NAM: ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్‌ విజయం.. సూపర్‌-12కు అర్హత!

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top