T20 WC 2021 NZ Vs SCO: గప్తిల్‌ విధ్వంసం.. న్యూజిలాండ్‌ ఖాతాలో మరో విజయం

T20 World Cup 2021: New Zealand Vs Scotland Match Live Updates And Highlights In Telugu - Sakshi

గప్తిల్‌ విధ్వంసం.. న్యూజిలాండ్‌ ఖాతాలో మరో విజయం
సమయం 18:59.. పసికూన స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. మార్టిన్‌ గప్తిల్‌(56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో నిర్ణీత ఓవర్లలో 5  వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్‌.. అద్భుత పోరాటపటిమను కనబర్చి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి ఓటమిపాలైంది.

మైఖేల్‌ లీస్క్‌(20 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జార్జ్‌ మున్సే(18 బంతుల్లో 22; ఫోర్‌, 2 సిక్సర్లు), మ్యాథ్యూ క్రాస్‌(29 బంతుల్లో 27; 5 ఫోర్లు) స్కాట్లాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌, ఐష్‌ సోధి తలో రెండు వికెట్లు దక్కించుకోగా టిమ్‌ సౌథీ ఓ వికెట్‌ పడగొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన మార్టిన్‌ గప్తిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. 

బెర్రింగ్టన్‌(20) ఔట్‌.. స్కాట్లాండ్‌ 106/5
సమయం 18:40.. 16వ ఓవర్‌ నాలుగో బంతికి ఐష్‌ సోధి బౌలింగ్‌లో డెవాన్‌ కాన్వేకు క్యాచ్‌ ఇచ్చి బెర్రింగ్టన్‌(17 బంతుల్లో 20; ఫోర్‌, సిక్స్‌) ఔటయ్యాడు. ఫలితంగా స్కాట్లాండ్‌ 106 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మైఖేల్‌ లీస్క్‌(4), క్రిస్‌ గ్రీవ్స్‌ ఉన్నారు.

మెక్‌లియాడ్‌(12) ఔట్‌.. స్కాట్లాండ్‌ 102/4
సమయం 18:34.. భారీ లక్ష్య ఛేదనలో పసికూన స్కాట్లాండ్‌ తడబడుతుంది. ఆరంభంలో ధాటిగా ఆడినట్లు కనిపించినా.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా పయనిస్తుంది. 15వ ఓవర్‌ ఐదో బంతికి బౌల్ట్‌ బౌలింగ్‌లో మెక్‌లియాడ్‌(15 బంతుల్లో 12) క్లీన్‌ బౌల్డ్‌ కావడంతో స్కాట్లాండ్‌ 102 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. క్రీజ్‌లో రిచీ బెర్రింగ్టన్‌(20), మైఖేల్‌ లీస్క్‌(1) ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన స్కాట్లాండ్‌.. క్రాస్‌(27) ఔట్‌
సమయం 18:14.. మిల్నే వేసిన ఒకే ఓవర్‌లో 5 బౌండరీలు బాది జోరుమీదున్నట్లు కనిపించిన మాథ్యూ క్రాస్‌(29 బంతుల్లో 27; 5 ఫోర్లు)ను సౌథీ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 11 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్‌ స్కోర్‌ 77/3. క్రీజ్‌లో రిచీ బెర్రింగ్టన్‌(6), కలమ్‌ మెక్‌లియాడ్‌ ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన స్కాట్లాండ్‌.. మున్సే(22) ఔట్‌
సమయం 18:01.. ఐష్‌ సోధి వేసిన 8వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో విరుచుకుపడిన జార్జ్‌ మున్సే(18 బంతుల్లో 22; ఫోర్‌, 2 సిక్సర్లు) అదే ఓవర్‌లో సౌథీ చేతికి చిక్కి ఔటయ్యాడు. అంతకుముందు ఆడమ్‌ మిల్నే వేసిన 6వ ఓవర్‌లో మ్యాథ్యూ క్రాస్‌ ఐదు వరుస బౌండరీలతో చెలరేగాడు. 8 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్‌ స్కోర్‌ 67/2. క్రీజ్‌లో మ్యాథ్యూ క్రాస్‌(23), రిచీ బెర్రింగ్టన్‌ ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన స్కాట్లాండ్‌.. కొయెట్జర్‌(17) ఔట్
173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్కాట్లాండ్‌.. ఇన్నింగ్స్‌ 3వ ఓవర్‌ నాలుగో బంతికి తొలి వికెట్‌ కోల్పోయింది. ట్రెంట్‌ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్‌ ఇచ్చి కొయెట్జర్‌(11 బంతుల్లో 17; 4 ఫోర్లు) ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత స్కాట్లాండ్‌ స్కోర్‌ 25/1. క్రీజ్‌లో జార్జ్‌ మున్సే(6), మ్యాథ్యూ క్రాస్‌ ఉన్నారు.

గప్తిల్‌ వీరవిహారం.. స్కాట్లాండ్‌ ముందు భారీ టార్గెట్‌
సమయం 17:13.. ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు నష్టపోయి 172 పరుగులు చేసింది. గప్తిల్‌కు గ్లెన్‌ ఫిలిప్‌(37 బంతుల్లో 33; సిక్స్‌) సహకరించడంతో కివీస్‌ ప్రత్యర్ధికి భారీ టార్గెట్ నిర్ధేశించగలిగింది. డారిల్‌ మిచెల్‌(13), విలిమయ్సన్‌(0), డెవాన్‌ కాన్వే(1) నిరాశపరిచారు. స్కాట్లాండ్‌ బౌలర్లు రెండుసార్లు ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. సాఫ్యాన్‌ షరీఫ్‌(2/28), బ్రాడ్లీ వీల్‌(2/40), మార్క్‌ వాట్‌(1/13) రాణించారు.  

వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌..
సమయం 17:03.. స్కాట్లాండ్‌ బౌలర్‌ బ్రాడ్లీ వీల్‌ 19వ ఓవర్‌లో న్యూజిలాండ్‌కు షాకిచ్చాడు. వరుస బంతుల్లో గ్లెన్‌ ఫిలిప్‌(37 బంతుల్లో 33; సిక్స్‌), మార్టిన్‌ గప్తిల్‌(56 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్సర్లు)లను పెవిలియన్‌కు పంపాడు. దీంతో న్యూజిలాండ్‌ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. క్రీజ్‌లో జేమ్స్‌ నీషమ్‌(5), మిచెల్‌ సాంట్నర్‌(1) ఉన్నారు.

న్యూజిలాండ్‌ను వణికిస్తున్న స్కాట్లాండ్‌ బౌలర్లు.. 6 ఓవర్లలో 52/3
సమయం 16:05.. పసికూన స్కాట్లాండ్‌ న్యూజిలాండ్‌ను వణికిస్తోంది. 6 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టింది. తొలుత సాఫ్యాన్‌ షరీఫ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టగా.. 7వ ఓవర్‌ తొలి బంతికి మార్క్‌ వాట్‌.. డెవాన్‌ కాన్వే(1)ను పెవిలియన్‌కు పంపాడు. 7 ఓవర్ల తర్వాత న్యూజిలాండ్‌ స్కోర్‌ 54/3. క్రీజ్‌లో గప్తిల్‌(20 బంతుల్లో 29), గ్లెన్‌ ఫిలిప్‌ ఉన్నారు. 

న్యూజిలాండ్‌కు షాక్‌.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్‌
సమయం 15:55.. టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఇన్నింగ్స్‌ 5వ ఓవర్లో భారీ షాక్‌ తగిలింది. స్కాట్లాండ్‌ బౌలర్‌ సాఫ్యాన్‌ షరీప్‌ వేసిన ఆ ఓవర్లో న్యూజిలాండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. 4.1వ ఓవర్లో డారిల్‌ మిచెల్‌(13)ను షరీఫ్‌ ఎల్బీడబ్ల్యూ చేసి పెవిలియన్‌కు పంపగా.. ఆదే ఓవర్‌ ఐదో బంతికి న్యూజిలాండ్‌ మరో షాక్‌ తగిలింది. విలియమ్సన్‌ ఖాతా తెరవకుండానే మాథ్యూ క్రాస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో మార్టిన్ గప్తిల్‌(14 బంతుల్లో 15), డెవాన్‌ కాన్వే ఉన్నారు. 

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌ 2021 సూపర్‌ 12 గ్రూప్‌-2లో భాగంగా బుధవారం(నవంబర్‌ 3) మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌, స్కాట్లాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓ విజయం(టీమిండియాపై 8 వికెట్ల తేడాతో విజయం) మరో పరాజయం(పాక్‌ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి)తో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. స్కాట్లాండ్‌ సూపర్‌-12లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో (అఫ్గాన్‌ చేతిలో 130 పరుగుల తేడాతో ఓటమి, నమీబియా చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి) ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇక పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన ఏకైక పోరు(2009 టీ20 ప్రపంచకప్‌)లో కివీస్‌నే విజయం వరించింది.   
తుది జట్లు:
న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్‌), జేమ్స్ నీషమ్, డెవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్(వికెట్‌ కీపర్‌), మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్

స్కాట్లాండ్‌: జార్జ్‌ మున్సే, కైల్‌ కొయెట్జర్‌(కెప్టెన్‌), మాథ్యూ క్రాస్‌, రిచీ బెర్రింగ్టన్‌, కలమ్‌ మెక్‌లియోడ్‌, మైఖేల్‌ లీస్క్‌, క్రిస్‌ గ్రీవ్స్‌, మార్క్‌ వాట్‌, సాఫ్యాన్‌ షరీఫ్‌, బ్రాడ్లీ వీల్‌, ఈవాన్స్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top