T20 WC 2023: Smriti Mandhana Stunning Catch Vs WI-Women Match, Know More Details - Sakshi
Sakshi News home page

Smriti Mandana: వచ్చీ రావడంతో స్టన్నింగ్‌ క్యాచ్‌తో..

Feb 15 2023 7:58 PM | Updated on Feb 15 2023 8:46 PM

T20 WC: Smriti Mandhana Stunning Catch Vs WI-Women Match Viral  - Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో భారత స్టార్‌ స్మృతి మంధాన స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసింది. వేలి గాయం కారణంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉన్న మంధాన విండీస్‌తో మ్యాచ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక 13 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 75 పరుగులతో విండీస్‌ పటిష్టంగా కనిపించింది. ఈ దశలో దీప్తి శర్మ బౌలింగ్‌కు వచ్చింది.

ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో మూడో బంతిని క్యాంప్‌బెల్లె రివర్స్‌ స్వీప్‌ ఆడాలని ప్రయత్నించింది. అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకడంతో స్లిప్‌లో పడింది. అయితే ఇక్కడే మంధాన తన మెరుపు ఫీల్డింగ్‌ను ప్రదర్శించింది. క్యాంప్‌బెల్లె ఆడిన బంతి కాస్త ముందుకు పడడంతో మంధాన డైవ్‌ చేసి ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకుంది. దీంతో 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిసిన స్మృతి మంధాన పేరు స్టేడియంలో మార్మోగిపోయింది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement