WI Vs ZIM T20 WC 2022: జింబాబ్వేపై గెలిస్తేనే.. లేకపోతే ఇంటికే

T20 WC 2022: West Indies Must-Win Against Zimbabwe Super-12 Chance Alive - Sakshi

రెండుసార్లు టి20 ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌కు సంకట పరిస్థితి ఎదురైంది. గ్రూఫ్‌-బిలో క్వాలిఫయింగ్‌ పోరులో భాగంగా బుధవారం జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌ గెలిస్తేనే వెస్టిండీస్‌కు సూపర్‌-12 ఆశలు నిలుస్తాయి. ఒకవేళ మ్యాచ్‌ ఓడిందంటే మాత్రం విండీస్‌ ఇంటిబాట పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో  జింబాబ్వేతో మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ ఏంచుకుంది.

స్కాట్లాండ్‌ చేతిలో దారుణ పరాజయం చవిచూసిన విండీస్‌ జట్టు జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆ తప్పు చేయొద్దని భావిస్తోంది. జట్టుగా చూస్తే బలంగానే కనిపిస్తున్నప్పటికి అసలు మ్యాచ్‌లోకి వచ్చేటప్పటికి తుస్సుమనిపిస్తుంది. విడిగా చూస్తే విండీస్‌ జట్టులో హిట్టర్లకు కొదవ లేదు. నికోలస్‌ పూరన్‌, కైల్‌ మేయర్స్‌, షమ్రా బ్రూక్స్‌, ఎవిన్‌ లూయిస్‌, రోవ్‌మెన్‌ పావెల్‌ ఇలా ఎవరు చూసుకున్నా సరే పొట్టి క్రికెట్‌లో ఆరితేరిన వారే. అయితే జట్టుగా ఆడడంలో విఫలం అవుతున్న వెస్టిండీస్‌ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సూపర్‌-12 ఆశలు నిలుపుకుంటుందో లేదో చూడాలి.

ఇక జింబాబ్వే మాత్రం ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ఆ జట్టు మిడిలార్డర్‌ బ్యాటర్‌ సికందర్‌ రజా సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. అతనికి తోడుగా మిగతా బ్యాటర్లు కూడా బ్యాట్‌ ఝులిపిస్తే జింబాబ్వానే ఆపడం విండీస్‌ బౌలర్ల తరం కాదు. ఇక బౌలింగ్‌లోనే జింబాబ్వే మంచి ప్రదర్శన కనబరుస్తుంది. కాగా జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ అనారోగ్య కారణాలతో మ్యాచ్‌కు దూరం కాగా.. అతని స్థానంలో చకబ్వా జట్టును నడిపించనున్నాడు.

జింబాబ్వే: రెగిస్ చకబ్వా(కెప్టెన్‌), వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా,మిల్టన్ శుంబా,టోనీ మునియోంగా,ర్యాన్ బర్ల్,ల్యూక్ జోంగ్వే,టెండై చటారా, రిచర్డ్ నగరవ,బ్లెస్సింగ్ ముజారబానీ

వెస్టిండీస్: నికోలస్ పూరన్(కెప్టెన్‌),కైల్ మేయర్స్,జాన్సన్ చార్లెస్, ఎవిన్ లూయిస్, షమ్రా బ్రూక్స్,రోవ్‌మెన్ పావెల్, జాసన్ హోల్డర్, అకీల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒడియన్ స్మిత్, ఒబెద్‌ మెక్‌కాయ్

చదవండి: ఐర్లాండ్‌ ఘన విజయం.. సూపర్‌ 12 ఆశలు సజీవం

అఫ్రిది యార్కర్‌ దెబ్బ.. ఆస్పత్రి పాలైన ఆఫ్గన్‌ ఓపెనర్‌

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top