ధోని భయ్యా సలహాలు ఇప్పుడు వాడుతా: నట్టూ‌ | T Natarajan Recalls MS Dhoni Advice Ahead Of IPL 2021 | Sakshi
Sakshi News home page

ధోని భయ్యా సలహాలు ఇప్పుడు వాడుతా: నట్టూ‌‌‌

Apr 7 2021 3:29 PM | Updated on Apr 7 2021 8:39 PM

T Natarajan Recalls MS Dhoni Advice Ahead Of IPL 2021 - Sakshi

ముంబై: టీమిండియా బౌలర్‌ టి.నటరాజన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో నటరాజన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున 16 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. ఆ తర్వాత ఆసీస్‌తో సిరీస్‌కు అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న నటరాజన్‌ అక్కడా ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. తాజాగా మరోసారి ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్న నటరాజన్‌ ధోని గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

''గతేడాది సీజన్‌లో ధోని భయ్యా ఎన్నో విలువైన సలహాలు అందించాడు. ఫిట్‌నెస్‌ కాపాడుకోవడంపై పలు కీలక అంశాలు చర్చించాడు. అంతేగాక బౌలింగ్‌లో స్లో బౌన్సర్స్‌, కట్టర్స్‌లో ఉండే వివిధ అంశాల గురించి చర్చించాడు. అనుభవం వచ్చే కొద్ది మరింత రాటుదేలుతావు అన్నాడు. ఒక మ్యాచ్‌లో ధోని భయ్యా నేను వేసిన బంతిని లాంగాన్‌ మీదుగా భారీ సిక్స్‌ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే ధోని వికెట్‌ లభించింది.. కానీ నేను సెలబ్రేషన్‌ చేసుకోలేదు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ధోనితో చాలాసేపు చాట్‌ చేశాను. ఆ సమయంలో ఎన్నో విలువైన సలహాలు అందించాడు. ఇవన్నీ ఈ సీజన్‌లో అమలు చేయడానికి సిద్ధమవుతున్నా.

ఇక మా కెప్టెన్‌ వార్నర్‌ నన్ను ప్రోత్సహించే తీరు మరువలేననిది. నన్ను ప్రేమగా నట్టూ అని పిలిచే అతను ఎంకరేజ్‌ చేయడంలో ముందుంటాడు. అతని చొరవతోనే గతేడాది సీజన్‌లో అద్భుతంగా రాణించాను. అదే ప్రదర్శనను ఈ ఏడాది కొనసాగించేందుకు ప్రయత్నిస్తా.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 11న చెన్నై వేదికగా కేకేఆర్‌‌తో ఆడనుంది. 

చదవండి: 'ఏ స్థానంలో అయినా బ్యాటింగ్‌కు సిద్ధం'

కోహ్లి, రోహిత్‌ల నుంచి మెసేజ్‌లు వచ్చాయి: శాంసన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement