Suryakumar Yadav Sign Captured on Rohit Sharma's Bat in Viral Video - Sakshi
Sakshi News home page

IND vs BAN: సూర్యకుమార్‌ బ్యాట్‌తో బరిలోకి దిగిన రోహిత్‌..వీడియో వైరల్‌

Dec 6 2022 5:37 PM | Updated on Dec 6 2022 6:52 PM

Suryakumar Yadavs sign captured on Rohit Sharmas bat in viral video - Sakshi

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ అనం‍తరం ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాట్‌తో బరిలోకి దిగాడు. రోహిత్ శర్మ ఆడిన బ్యాట్‌పై ఎస్కే యాదవ్‌ అని రాసి ఉంది.

ఈ మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌ 27 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. కాగా రోహిత్‌, సూర్య దేశీవాళీ​ క్రికెట్‌లో ముంబై జట్టు తరపున ఆడారు. అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉన్నారు. అదే విదంగా ఐపీఎల్‌లో కూడా ముంబై ఇండియన్స్‌ తరపున కలిసి ఆడుతున్నారు.

కాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు సూర్యకుమార్‌ యాదవ్‌ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ అనంతరం సెలక్టర్లు సూర్యకు విశ్రాంతి ఇచ్చారు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన సూర్య.. వన్డే సిరీస్‌లో మాత్రం అంతగా రాణించలేకపోయాడు.
చదవండి: World Cup 2023: అతడు అద్భుతమైన ఆటగాడు.. వన్డే ప్రపంచకప్‌కు భారత ఓపెనర్‌గా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement